- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గురువారం పంచాంగం, రాశి ఫలాలు (27-05-2021)
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : పాడ్యమి
(నిన్న సాయంత్రం 4 గం॥ 45 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 5 ని॥ వరకు)
నక్షత్రం : జ్యేష్ట
(ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 17 ని॥ నుంచి
ఈరోజు రాత్రి 10 గం॥ 32 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : కౌలవ
వర్జ్యం : (ఉదయం 6 గం॥ 14 ని॥ నుంచి 7 గం॥ 39 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (మధ్యాహ్నం 2 గం॥ 44 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 9 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 10 గం॥ 2 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 54 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 15 ని॥ నుంచి 4 గం॥ 7 ని॥ వరకు)
రాహుకాలం : ( మధ్యాహ్నం 1 గం॥ 50 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 27 ని॥ వరకు)
గుళికకాలం : (ఉదయం 8 గం॥ 56 ని॥ నుంచి 10 గం॥ 33 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 12 గం॥ 12 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 41 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : వృచ్చికము
మేష రాశి : సంఘంలో విశేషమైన గౌరవం లభిస్తుంది. అన్ని పనులను ప్రణాళిక వేసుకుని మొదలు పెట్టండి. ఈరోజు ఏ పనులను పెండింగ్ ఉంచకూడదు అనే పూర్తి ఉత్సాహంతో మొత్తం పనులను పూర్తి చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికపరమైన విషయాలు మెరుగుపడతాయి మీరు పెట్టిన పెట్టుబడులు మీకు లాభాలను తీసుకు వచ్చే సమయం. విద్యార్థులు, నిరుద్యోగులు మీ గమ్యం దగ్గర్లోనే ఉంది. ఈ రాశి స్త్రీలకు మీ జీవితంలో ఇది మరపురాని రోజు
వృషభ రాశి : పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. అతి కోపము, నిరాశావాదం ఈ రెండూ మీకు పనికిరావు గుర్తుంచుకోండి. ఉద్యోగంలో అధిక శ్రమ ఉన్నా పనులను పూర్తిచేస్తారు. రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉండే అవకాశం జాగ్రత్త వహించండి. కొంతమందికి వెన్నునొప్పి బాధించవచ్చు. యోగ ఒకటి ప్రత్యామ్నాయం. స్థిరాస్తి కొనుగోలుకు ప్రయత్నాలు చేస్తారు ఈ రాశి స్త్రీలకు మీ కుటుంబ, వైవాహిక విషయాలలో మూడవ వ్యక్తి కి స్థానం ఇవ్వవద్దు.
మిధున రాశి : ఈ కరోనా సమయంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి నడక మంచిది. వంశపారంపర్యంగా రావలసిన ఆస్తుల విషయంలో మీకు అనుకూలంగా ఒక విషయం తెలుస్తుంది. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఎటువంటి ఇబ్బందులు లేవు. ధన లాభం ఉంది. అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఆరోగ్యం పూర్తిగా సహకరించడంతో ఉత్సాహంగా ఉంటారు.
కర్కాటక రాశి : వ్యాపారంలో రావలసిన పెట్టుబడులు సమకూరుతాయి. ఆఫీసులో పనులు నిదానంగా సాగటం వలన అశాంతి. కొందరికి మీ వల్ల ఉపకారం జరుగుతుంది ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది. సామాజిక కార్యక్రమాలలో ప్రముఖులు పరిచయమవుతారు ఈ రాశి స్త్రీలకు ఈ రోజు అశాంతిగా గడుపుతారు. నివారణ కోసం దైవ ప్రార్థన చేయండి.
సింహరాశి : పనులు పూర్తి కావాలంటే ప్రణాళిక తప్పనిసరి ఇది మీ జీవితంలో గుర్తుంచుకోండి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఖర్చులను తగ్గించండి డబ్బును పొదుపు చేయండి. పనులలో అతి శ్రమ మీకు అశాంతి కలిగిస్తుంది. ఈ రాశి స్త్రీలకు కొన్ని పనులు ఆందోళనను కలిగిస్తాయి. ప్రశాంతంగా ఆలోచించి పనులు పూర్తి చేయండి.
కన్య రాశి : కుటుంబంలోని వ్యక్తులతో నిజాయితీతో మెలగండి అందరి మద్దతు మీకు లభిస్తుంది. ఆఫీసులో కొత్త బాధ్యతలు మిమ్మల్ని శ్రమకు గురి చేస్తాయి. మనస్సులోకి ఆందోళనను రానీయకుండా ప్రశాంతంగా పని చేయండి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. స్పెక్యులేషన్ వల్ల ధన నష్టం అనవసరపు ఖర్చులు జోలికి పోకండి. ఆరోగ్యం చక్కబడి తీసుకోవాలంటే నడక తప్పనిసరి ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి మొరటుతనం మిమ్ములను బాధిస్తుంది. పక్షులకు బియ్యపు గింజలు వేయండి.
తులారాశి : ఈ కరోనా సమయంలో డబ్బు ఉద్యోగం మరియు కుటుంబం విషయాలలో లేనిపోని అనుమానాలతో టెన్షన్ పడతారు. ఏది ముగిసిపోలేదు అని గుర్తుంచుకోండి సరైన ప్రణాళికతో వీటన్నిటినీ అధిగమిస్తారు. ఫిట్నెస్ కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆఫీసులో మీ కింది ఉద్యోగులు అన్ని విధాలుగా మీకు మద్దతు తెలుపుతారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి వలన చిన్న చిన్న గొడవలు వచ్చిన వాటిని అధిగమిస్తారు.
వృశ్చిక రాశి : ఆకస్మిక ధన లాభం. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తిలో మీకో శుభవార్త. అతిగా తినకండి ఫిట్నెస్ కాపాడుకోండి వ్యాయామం చేయండి. అన్ని విధాలుగా మంచి రోజు ఉద్యోగంలో మీ పనిని పై అధికారులు ప్రశంసిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి యొక్క కేరింగ్ మీకు పూర్తి భరోసా ఇస్తుంది.
ధనస్సు రాశి : కుటుంబంలోని వాతావరణం మీకు ప్రశాంతతను ఇస్తుంది. స్థిరాస్తి కొనుగోలుకు అనుకూలమైన సమయం. ముఖ్యమైన నిర్ణయాలలో మీ విలువలను వదులుకోకండి. మీకు రావలసిన బాకీలు కొంత ఇబ్బంది పెట్టినా చివరికి దక్కుతాయి. ఆఫీసులో పని విషయంలో శ్రమ పెరిగినా పట్టుదలతో సహనంతో పూర్తిచేస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ లాక్ డౌన్ సమయంలో మీ పిల్లల కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచండి.
కుంభరాశి : వ్యాపారంలో, ఆఫీసులో మరియు కుటుంబ వ్యవహారాలలో ఇతరుల సహకారం తీసుకోండి. కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి వారితో సమయం గడపండి. దానివలన కుటుంబ వ్యవహారాలు పూర్తిగా సంతృప్తి నిస్తాయి. స్థిరాస్తుల కొనుగోలు లో అనుకోని అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అనుకోని ఖర్చుల కొరకు మీ సేవింగ్స్ లో నుంచి డబ్బులు తీస్తారు. ఉద్యోగంలో మీ విలువ అందరికీ తెలుస్తుంది. అందరి ప్రశంసలు లభిస్తాయి. డబ్బును అనేక విధాలుగా పెట్టుబడులు పెట్టడానికి ప్రణాళికలు వేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామితో మాట పెరగటానికి బంధువులు ఒక కారణం అవుతారు.
మకర రాశి : ఆర్థిక విషయాలలో ప్రణాళిక వేసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును జాగ్రత్త పరచుకోండి. వచ్చిన అవకాశాలను కాలదన్ను కోకండి. తెలివైన నిర్ణయం తీసుకోండి. ఆఫీసులో సహోద్యోగుల తో మరియు పై అధికారులతో వాదోపవాదాలకు దిగకండి. ఉద్యోగానికి ప్రమాదం. నూతన పెట్టుబడులకు సరైన సమయం. అనుకోని అతిధులు రావడం వలన అనవసరపు ఖర్చు. ఈ రాశి స్త్రీలకు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.
మీన రాశి : సామాజిక కార్యక్రమాలలో ఆనందంగా పాల్గొంటారు. మీకు అందరి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక విషయాలలో మీరు కోరుకున్న స్థితి లభించే అవకాశం. ఫిట్ నెస్ కాపాడుకోవటానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తారు. మీ సరైన ఆలోచన అన్ని విధాలుగా మీకు విజయం వైపు మార్గం చూపుతుంది. ఆత్మీయులతో గడపటం వలన మానసిక ప్రశాంతత. కొత్త పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్ములను బాధపెట్టినా సర్దుకుపోతారు.