జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

by Sumithra |   ( Updated:2021-08-20 22:56:55.0  )
జమ్మూకాశ్మీర్‌లో కాల్పుల కలకలం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క : జమ్మూకాశ్మీర్‌లో మరోసారి కాల్పుల కలకలం స‌ృష్టించాయి. అవంతిపొరాలోని త్రాల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాల ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఈ ఎదురు కాల్పుల్లో జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు మరణించినట్టు కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

Next Story

Most Viewed