- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వీఆర్ఎపై దాడి చేసిన నిందితుల అరెస్ట్
by Shyam |
దిశ, మెదక్: వీఆర్ఎ పై దాడి చేసి ఇసుకు లారీలను ఎత్తుకెళ్లిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సంగారెడ్డి రూరల్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన ప్రకారం.. కంది తహశీల్దార్ తన సిబ్బందితో కలిసి గురువారం తనిఖీలు నిర్వహించారు. ఇసుక తరలిస్తున్న ఎనిమిది వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు వాహనాల వద్ద వీఆర్‌ఏలను కాపాలాగా పెట్టారు. వీరిపై వాహనాల యజమాని యాదుల్లా తన డ్రైవర్లతో కలిసి శుక్రవారం దాడి చేసి రెండు లారీలను ఎత్తుకెళ్లారు. తహశీల్దార్ ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని తెలిపారు.
Tags: Medak,lorry driver Attack,vra,Kandi Mro,police
Next Story