- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి..!
X
దిశ, చెన్నూర్: కరోనా పంజా విసిరి ఒకే కుటుంబంలో 20 రోజుల వ్యవధిలో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గోదావరి రోడ్డుకు చెందిన చకీనారపు భూమయ్య.. 20 రోజుల క్రితం కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. భూమయ్య చనిపోయిన వారం రోజులకు ఆయన చిన్న కొడుకు కిషోర్ కుమార్ కరోనా వ్యాధితో మృతి చెందాడు. ఇప్పటికే ఇద్దరిని కోల్పోయి శోకసంద్రంలో ఉన్న వారి కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి భూమయ్య రెండో కొడుకు కిరణ్ కుమార్ హైదరాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా వ్యాధితో ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కిరణ్ కుమార్ మరణవార్త తెలియగానే పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు వ్యాపార సంస్థలను బంద్ చేయించారు.
Advertisement
Next Story