అందగత్తెకు రేప్ వార్నింగ్

by Anukaran |
అందగత్తెకు రేప్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె ఓ అందెగత్తె. ఆమెకు సోషల్ మీడియాలో లక్షల కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె అప్పడప్పుడు సరదాగా దిగిన ఫొటోలే కాదు.. కొన్ని హాట్ హాట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిప్రాయాలను పంచుకుంటుంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె ఫొటోలను కూడా షేర్ చేస్తూ ఉంటది. ఇవి చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తుంటారు. కొంతమంది సరదాగా కొన్ని పోస్టులు పెడుతుంటారు. వాటిని చూసిన ఆమె ఓ చిన్ని నవ్వు నవ్వుకంటూ సరదాగా తీసుకుంటుంది. కానీ, ఈ సారి మాత్రం వచ్చిన కొన్ని పోస్టులను చూసి ఆమె భయపడి పోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించి తనకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాదు.. ఇప్పటివరకు ఇలా ఎప్పుడూ భయపడలేదు కానీ, ప్రస్తుతం చాలా భయమేస్తోందని ఆమె చెప్పుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

చార్ బోర్లీ అనే అనే అందగత్తే. అంతేకాదు ఈమె ప్రముఖ మోడల్. ప్రస్తుతం ఈమె వయస్సు 36 ఏళ్లు. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఆమె కూడా తల్లి లాగే అందంగా ఉంటుంది. అయితే, చార్ బోర్లీ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటది. తన ఫొటోలను అప్పుడప్పుడు అప్ లోడ్ చేస్తుంటది. హార్ట్ ఫొటోలు, తన కూతురి ఫొటోలు ఇలా తనకు నచ్చిన ఫొటోలను తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేస్తుంటది. ఈమెకు సుమారు 5 లక్షల వరకు ఫాలోవర్స్ ఉన్నారు. అయితే, ఈసారి కొంతమంది ఫాలోవర్స్ బెదిరింపు పోస్టులు పెట్టారంట. తనను చంపుతానని, తన కూతురిని రేప్ చేస్తామని బెదిరించినట్లు ఆమె పోలీసులను కలిసి ఫిర్యాదు చేసిందంట. ఈ నేపథ్యంలో తీవ్ర భయాందోళనకు గురవుతోంది. తాను ఎప్పుడూ కూడా ఇలా భయపడలేదు.. కానీ, ఆ పోస్టులు ఎవరు పెట్టారు.. ఎందుకు పెట్టారో అర్థం కావడంలేదని.. ఆ పోస్టులను చూసినప్పటి నుంచి తనకు చాలా భయమేస్తోందంటూ ప్రముఖ మోడల్ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed