- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వీహెచ్‌కు బెదిరింపు కాల్

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ దుమారం రేగుతోంది. సమయం దొరికినప్పుడల్లా పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు ఎంపీ రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. తాజాగా రేవంత్‌కు టీపీసీసీ పదవి ఇస్తే.. తాను పార్టీ నుంచి బయటకు వెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆగ్రహించిన రేవంత్ అభిమానులు వీహెచ్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డి గురించి మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. అంతేగాకుండా గుర్తుతెలియని వ్యక్తి అసభ్య పదజాలంతో వీహెచ్‌ను దూషించాడు. దీంతో సైబరాబాద్ పోలీసులకు వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
Next Story