335 మందితో తమిళ నటుడి డేటింగ్.. టార్గెట్ 365!

by Shyam |
life
X

దిశ, ఫీచర్స్ : ఇప్పటిదాకా ఓ పాతిక, యాభై మందితో డేటింగ్ చేసినవారి గురించి విన్నాం కానీ.. ఏకంగా వందల మందితో డేట్ చేసినవారి గురించి వినడం అరుదే. ఒకవేళ విన్నా.. ఫారినర్స్ విషయంలో అలా జరిగి ఉండవచ్చని అనుకుంటాం గానీ, ఇండియాలోనే అంటే ఆశ్చర్యపోక తప్పదు. కాగా ఇప్పటికే 335 మందితో డేటింగ్ చేసిన తమిళనాడుకు చెందిన యాక్టర్ కమ్ డ్యాన్సర్ సుందర్ రాము.. తన టార్గెట్ 365 అని చెబుతున్నాడు. ఇంతకీ ఈ డేటింగ్ స్టోరీ వెనకాల గల ఉద్దేశ్యమేంటో తెలుసుకుందాం..

చెన్నైకి చెందిన సుందర్ రాము వృత్తిపరంగా నటుడు, డ్యాన్సర్. 2015లో ఈ డేటింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తను.. ఇప్పటి వరకు 335 మంది మహిళలతో డేట్ చేశాడు. త్వరలోనే మరో 30 మందితో డేట్ చేసి, తన మిషన్(టార్గెట్ 365) కంప్లీట్ చేయాలని భావిస్తున్నాడు. స్వతహాగా రొమాంటిక్ పర్సన్ అయిన రాము.. ఈ ప్రాసెస్‌లో ప్రేమను పొందడమే కాకుండా, భారత్‌లోని మహిళలకు తమ హక్కులపై అవగాహన కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నాడు.

‘నేను మహిళల్ని అమితంగా గౌరవించే ఫ్యామిలీలో పెరిగాను. ఎటువంటి జెండర్ డిస్క్రిమినేషన్ లేని స్కూల్‌లో చదువుకున్నాను. కానీ లింగ భేదాలు ఎంత లోతుగా వ్యాపించిఉన్నాయో బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాతే తెలిసింది. కల్చర్ పట్ల ఇది నాకు పెద్ద షాక్ కలిగించింది. ఇక 2012 డిసెంబర్‌లో నిర్భయ గ్యాంగ్ రేప్ ఘటన తర్వాత నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. మార్పు కోసం ఏదైనా చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నా. ఈ మేరకు 1 జనవరి, 2015న ఈ ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేస్తున్నట్టు ఫేస్‌బుక్‌లో ప్రకటించాను. అయితే తను చేసేది సెక్సువల్ డేటింగ్ కాదు’ అని చెప్పుకొచ్చాడు.

కాగా ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన కొత్తలో.. తెలిసిన వ్యక్తుల నుంచే కాల్స్ వచ్చినట్లు వచ్చాయని, ముందుగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నాకే డేట్‌కు వెళ్లేవాళ్లమని చెప్పాడు. ఇప్పటివరకు దేశ, విదేశాల్లో కలిపి 335 మందితో డేటింగ్ చేశానని.. వీరిలో తన నాన్నమ్మతో పాటు చెత్త ఎత్తుకునే మహిళలు, కూలి పనులు చేసుకునేవారు కూడా ఉన్నారని చెప్పాడు. అంతేకాదు 90 ఏళ్ల ఐరిష్‌ సన్యాసినితో పాటు వియత్నాం, స్పెయిన్, ఫ్రాన్స్, యూఎస్, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాల్లోని పలు రంగాలకు చెందిన మహిళలతో డేటింగ్‌ చేశానన్న రాము.. తన నాన్నమ్మతో చేసిన డేట్ అన్నింటికంటే ప్రత్యేకమని పేర్కొన్నాడు.

Advertisement

Next Story