- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్‌డౌన్ మరోసారి పొడిగిస్తాం: కిషన్‌రెడ్డి
కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించనున్నట్లు కేంద్ర హోం సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందుకు ప్రజలు మానసికంగా సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల నమోదు, మరణాలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో లాక్ డౌన్ పొడిగింపు తప్ప మరో గత్యంతరం లేదని కిషన్‌రెడ్డి తేల్చి చెప్పారు.
వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలు, రెడ్ జోన్లలో మే 3 తరువాత లాక్‌డౌన్ మరింత కఠినంగా అమలు చేయాలని.. ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. కరోనా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లాక్‌డౌన్ కారణంగా సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ ప్రజల ప్రాణాలే ముఖ్యమన్నారు. వైరస్ తీవ్రత దృష్టిలో ఉంచుకునే లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగిస్తున్నట్లు, అందుకు అందరూ మానసికంగా సిద్ధంగా ఉండాలన్నారు. గ్రీన్ జోన్లలో ప్రజా రవాణా, మాల్స్, థియేటర్లకు మినహా మిగతా వాటికి అనుమతించినట్లు మంత్రి పేర్కొన్నారు.
Tags: lockdown, extension, central minister, kishan reddy