ఓ వైపు ప్రమాణ స్వీకారం.. మరోవైపు దొంగల బీభత్సం

by Shyam |
Former Sarpanch Srinivas
X

దిశ, పరకాల: వరంగల్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రజాప్రతినిధుల జేబులను లూటీ చేశారు. వివరాల్లోకి వెళితే.. పరకాల మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రంలో సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశానికి భారీగా ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, టీఆర్ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు. ఇదే అదునుగా భావించిన జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ వద్ద రూ. 15 వేలు, పరకాల జెడ్పీటీసీ వద్ద రూ.3500, కామారెడ్డిపల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మహేందర్ రెడ్డి వద్ద రూ.1500, కామరెడ్డిపల్లికి చెందిన తండా మహేష్ వద్ద రూ.15 వేలు, పరకాల పట్టణానికి చెందిన సంతోష్ వద్ద రూ.8 వేలు కాజేశారని తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం అనంతరం జేబులు చూసుకున్న అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కాగా, సమావేశంలో పోలీసులు ఉండగానే దొంగలు వారి చేతివాటం ప్రదర్శించడం గమనార్హం.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed