- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరెస్టులతో టీడీపీ నాయకులను ఆపలేరు
దిశ, ఏపీ బ్యూరో: ప్రజల కోసం పోరాడే ఉద్యమ కారులను అరెస్టులతో, అక్రమ కేసులతో ఆపలేరని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ స్పష్టం చేశారు. బెయిల్‌పై విడుదలైన మాజీ మంత్రి దేవినేని ఉమాను గొల్లపూడిలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఘటనపై చర్చించారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేసే అన్యాయాలను, అక్రమ మైనింగ్‌లను ప్రశ్నిస్తున్నారనే సీఎం వైఎస్ జగన్, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌లు దేవినేని ఉమాపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు.
రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా, పులివెందుల రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతుందని వైవీబీ మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. తాము ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తెలిపారు. వైసీపీ చేస్తున్న అక్రమాలను బయటపెడతామని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న నియంతృత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని త్వరలోనే ఈ జగన్ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుందని ధ్వజమెత్తారు. వైవీబీ రాజేంద్రప్రసాద్‌తోపాటు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ఇతర టీడీపీ నాయకులు దేవినేని ఉమాను పరామర్శించారు.