పిల్లలకు చక్కిలిగింతలు పెడుతున్నారా.. సరదాగా అనిపించినా చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు?

by Anjali |
పిల్లలకు చక్కిలిగింతలు పెడుతున్నారా.. సరదాగా అనిపించినా చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు?
X

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది పిల్లలకు చెక్కిలిగింతలు పెట్టడం చూస్తూనే ఉంటాం. నవ్వించడానికి ట్రై చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లో ఉంటుంది. కానీ నిపుణులు చెబుతోన్న ప్రకారం చూసినట్లైతే.. ఇది మంచి అలవాటు కాదని అంటున్నారు. ఈ చెక్కిలి గింతలు పిల్లల్లో పలు రకాల అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని చెబుతున్నారు. మరీ అవేంటో ఇప్పుడు చూద్దాం..

పిల్లలకు చెక్కిలిగింతలు పెట్టినప్పుడు డైరెక్ట్ మెదడుపై ప్రభావం చూపుతుంది. ప్రతి ఒక్కరి మెదడులో చిన్న హైపోథాలమస్ అనే గ్రంథి ఉంటుందని.. కాగా దీనిలో విపరీతమైన ప్రేరేపణలు కలుగుతాయని నిపుణులు అంటున్నారు. ఆ ప్రేరేపణలు డైరెక్ట్ గా మెదడు మొదలు అంటే కాండం వద్ద ఎఫెక్ట్ చూపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ హైపోథాలమస్ గ్రంథి బాదం పప్పు షేప్‌లో ఉంటుంది. కితకితలు పెట్టడం వల్ల ఈ గ్రంథి ఎక్కువగా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది. ఇది పిల్లలపై దీర్ఘకాలికంగా ఎంతో ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే పిల్లలకు శ్వాస కూడా సరిగ్గా అందదు. తద్వారా ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.

దీంతో హైపోక్సియా అనే సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ కితకితలు పెట్టడం వల్ల కండరాల నియంత్రణ కోల్పోయే చాన్స్ ఉంటుంది. ఇది తాత్కాలికంగా పక్షవాతం బారిన పడే అవకాశం ఉంటుందని.. దీన్ని కాటా ఫ్లెక్సీ అని కూడా అంటారని వెల్లడించారు నిపుణులు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story