- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి..

దిశ ,హాలియా: రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ వేడుకల్లో భాగంగా శుక్రవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ ఇఫ్తార్ విందు స్థానిక లక్ష్మీ నరసింహ గార్డెన్స్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ప్రధానంగా మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తుందని తెలిపారు. ఇప్పటికే మైనార్టీలకు సంక్షేమం కోసం వివిధ పథకాలు చేపట్టిందని గుర్తు చేశారు.
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మతసామరస్యం వెల్లువిరిసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రుల సంకల్పంతో పని చేస్తుందని తెలిపారు. అనంతరం మైనారిటీలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ పీసీసీ సభ్యులు కర్నాటి లింగారెడ్డి మండల తహాసీల్దార్ రఘు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్ రెడ్డి, గాలి రవికుమార్ గౌడ్, ఆంగోతు భగవాన్ నాయక్, కాకునూరి నారాయణ గౌడ్, ఎడవల్లి నరేందర్ రెడ్డి, రాజా రమేష్ ,గడ్డం సాగర్ రెడ్డి, వెంపటీ శ్రీనివాస్, ఆర్ ఐ నవీన్, మజాహర్ హుస్సేన్, అన్వరుద్దీన్ ,బాబుదిన్, జహీరుద్దీన్, హమీద్, అక్బర్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.