- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇలాంటి వాడిని ఏం చేసిన పాపం లేదు.. అతికిరాతకంగా ఐదు కుక్క పిల్లలను చంపేశాడు!

దిశ, వెబ్ డెస్క్: హైదారాబాద్‌లో దారుణమైన అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఒకటి.. రెండు కాదు ఏకంగా ఐదు నవజాత కుక్కపిల్లలను అతి కిరాతకంగా చంపేశాడు. చనిపోయిందని నిర్ధారణ చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సీసీ కెమెరాల్లో రికార్డు అయినా దృశ్యాల ఆధారంగా ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..
హైదరాబాద్‌లోని (Hyderabad) ఫతేనగర్‌లో ఉన్న ఓ గేటెడ్ కమ్యూనిటీ సెల్లారులో మంగళవారం 6 రోజుల వయసున్న వీధి కుక్క పిల్లలు (Street dogs) చనిపోయి కనిపించాయి. ఏం జరిగిందో తెలుసుకోవడానికి అపార్టుమెంట్ యజమాన్యం సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అందులోని దృశ్యాలను చూసి వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. అదే కమ్యూనిటీలో నివసించే ఆశిష్ అనే వ్యాపారి ఆ కుక్క పిల్లలను దారుణంగా చంపేయటం అందులో రికార్డు అయింది. ఆ కుక్కపిల్లలను ఆ దుర్మార్గుడు నేలకేసి కొట్టి, గోడకు విసిరి చంపేశాడు. అంతేకాదు, కొన ఊపిరితో ఉన్న వాటి తలలను తన కాలితో తొక్కి ప్రాణం తీశాడు. దీనిపై యజమాన్యం ప్రశ్నించగా.. ఆ కుక్క పిల్లలను తన పెంపుడు కుక్క వద్దకు వచ్చాయని అందుకే చంపేసినట్లుగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో అతడిపై అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జంతు సంక్షేమ కార్యకర్త ముదావత్ ప్రీతి మాట్లాడుతూ వీధులపై ఇలాంటి క్రూరమైన చర్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టడానికి కఠినమైన శిక్ష విధించాలని అన్నారు.
Sensitive Content
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025
హైదరాబాద్ - ఫతేనగర్ హోమ్ వ్యాలీలో అప్పుడే పుట్టిన 5 కుక్క పిల్లలు చంపిన దుర్మార్గుడు
అపార్ట్మెంట్ సెల్లార్లో తన పెంపుడు కుక్క దగ్గరకు వీధి కుక్క వచ్చిందని దాని 5 పిల్లలను చంపిన మూర్కుడు pic.twitter.com/psfJsURZYE