చైన్ స్నాచింగ్ పాల్పడి.. అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్

by Kalyani |
చైన్ స్నాచింగ్ పాల్పడి.. అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తి అరెస్ట్
X

దిశ,కార్వాన్ : చైన్ స్నాచింగ్ కు పాల్పడి, అమ్మేందుకు ప్రయత్నించిన వ్యక్తిని హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. ఈ మేరకు శుక్రవారం సౌత్ అండ్ వెస్ట్ జోన్ డిసిపి చంద్రమోహన్ మెహిదిపట్నం కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన ముమ్మిడి మోహన్ రెడ్డి, తమ బంధువులు మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సాగర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్టీసీ బస్సులో ఎక్కి మెహిదీపట్నం చేరుకున్నాడు. ఈ క్రమంలో బస్ స్టాప్ వద్ద అతడు దిగుతుండగా ఫుట్ బోర్డు వద్ద మెడలో ఉన్న చైన్ ను గుర్తుతెలియని వ్యక్తి దొంగిలించారు. వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మల్లేపల్లి మాంగార్ బస్తీ ప్రాంతానికి చెందిన లక్ష్మణ్ రాథోడ్ 31 ప్రైవేట్ వర్కర్. గురువారం రాత్రి విజయనగర్ కాలనీలో బంగారు గొలుసులు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన లక్ష్మణ్ పోలీసులు పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ఈ క్రమంలో పోలీసులు విచారించగా మూడు దొంగతనాలు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వారు తెలిపారు. కాగా నిందితుని వద్ద మూడున్నర తులాల బంగారు గొలుసులను స్వాధీనం చేసుకున్నట్లు డిసిపి పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ లో హుమాయున్ నగర్ సీఐ ఎస్. మల్లేష్, డిఐ బాలకృష్ణ తోపాటు క్రైమ్ సిబ్బందిని డిసిపి తో పాటు ఆసిఫ్ నగర్ ఏసిపి విజయ శ్రీనివాస్ అభినందించారు.



Next Story

Most Viewed