టీకాల పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదు

by Shyam |   ( Updated:2021-05-11 11:27:01.0  )
టీకాల పంపిణీకి ఎలాంటి ఆటంకం ఉండదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ వలన వైద్య సేవల్లోనూ, టీకా పంపిణీలోనూ ఎలాంటి అంతరాయాలు ఉండబోవని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు ప్రకటించారు. టీకా సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తామని తెలిపారు. వ్యాక్సిన్‌ను కేవలంను 45ఏళ్ల దాటిన రెండవ డోసు వారికి మాత్రమే అందిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో టెస్ట్‌లు ఇతర ఆరోగ్య సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. టీకా కేంద్రాలు యథావిధిగా పంపిణీని చేపడుతారని చెప్పారు. ఇది వరకు ప్రకటించినట్టుగానే రెండవ డోసు టీకాను మాత్రమే అందిస్తామని తెలిపారు.

టీకా సెంటర్‌కు వచ్చే వారు మొదటి డోసు టీకా తీసుకున్నట్టుగా ఆధారాలు తప్పనిసరిగా చూపించాలని సూచించారు. కొవిన్ వెబ్‌సైట్ నుంచి మొదటి టీకా తీసుకున్నట్టుగా ఆధారాలు సేకరించవచ్చని తెలిపారు. వ్యాధి లక్షణాలున్నవారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సమీపంలోని టెస్టింగ్ సెంటర్‌కు వెళ్లి టెస్ట్‌లు చేయించుకోవాలని సూచించారు. కొవిడ్ టెస్ట్‌ల కోసం, టీకాల కోసం ప్రయాణాలు చేస్తున్న వారికి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించబోరని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed