- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈటల రాజేందర్: సీఎం ఫాంహౌజ్‌లో పోస్టు మార్టం ఏంటి?
దిశ, గజ్వేల్ /మర్కూక్: ఈ నెల 20న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో మృతి చెందిన యువకుడు ఆంజనేయులు మృతిపై రాష్ట్ర ప్రజలకు అనేక సందేహాలు, అనుమానాలున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరియు రాష్ట్ర పోలీస్ యంత్రాగంపై ఉందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజ్ పూర్ గ్రామాన్ని ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తలతో కలిసి సందర్శించారు.
సీఎం ఫాంహౌజ్ లో మృతి చెందిన ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబీకులకు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఈటల విలేకరులతో మాట్లాడుతూ…ముఖ్యమంత్రి భూములు కొనుగోలు చేసి ఫాంహౌస్ చేసుకోవడం ఏమిటో కానీ దీని వల్ల స్థానిక రైతులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి ఫౌంహౌజ్ కు వచ్చే, వచ్చిన ప్రతి సందర్భంలోనూ స్థానిక ప్రజలను భద్రత పేరుతో పోలీసులు ఇండ్లలోనే కట్టడి చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు వారి పోలాలకు వెళ్ళలేని దుస్థితి నెలకొందంటూ వారు పోతున్నారన్నారు . ముఖ్యమంత్రి వ్యవసాయ క్షేత్రంలోని 4 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పిన బావి వద్ద ముళ్లపొదలను తొలగిస్తుండగా ఆంజనేయులు బావిలోపడి మరణించాడా లేక ఇతర కారణాల చేత మృతి చెందాడా అన్నఅనుమానాలు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా వ్యక్తమవుతున్నాయన్నారు.
ఓ దశలో యువకుడి సంఘటనను రాష్ట్ర ప్రజలు అనుమానస్పద మృతిగా భావిస్తున్నారని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉందన్నారు. అసలు ఆంజనేయులు మృత దేహానికి సీఎం ఫౌంహౌజ్ లో పోస్ట్ మార్టం నిర్వహణ ఏమిటో అంటూ ఇలా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు. అసలు వాస్తవాలను మృతుని కుటుంబీకులకు, రాష్ట్ర ప్రజలకు పోలీసులు బహిర్గతపర్చాలంటూ డిమాండ్ చేశారు. ఆంజనేయులు మృతి ఇప్పటికి ఓ మిస్టరీనే తలపిస్తుందని, యువకుడి మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయని ఈ సంఘటన పై ప్రత్యేక బృందాన్ని నియమించి మృతి సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఈటల డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి 50 వేలు ఇచ్చి టీఆర్ఎస్ నాయకులు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువకుడి కుటుంబీకులకు వారి కడుపు కోతను తీర్చేలా ప్రభుత్వం స్పందించి వారికి తగిన న్యాయం చేయాలని ఈటల కోరారు.