- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోలీసులకు ఇదేమి ‘శిక్ష’ణ!
దిశ, వరంగల్: కరోనా దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నా.. ఆ రూల్స్ మాకు వర్తించవు అన్నట్లుగా ఉంది పోలీసుల వ్యవహారం. కొద్ది రోజులుగా మామునూర్ బెటాలియన్, మడికొండ ట్రైనింగ్ సెంటర్లలో పోలీసుల శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు నిదర్శనం. సుమారు వెయ్యి మందికి పైగా ఆయా సెంటర్లలో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలెవరూ గడప దాటి రావొద్దు, గుంపులుగా ఉండకూడదు, శుభకార్యాలకు దూరంగా ఉండాలని పదే పదే చెబుతున్న తరుణంలో వందల మందికి ఒకచోట శిక్షణ ఇస్తుండటం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఈ క్రమంలోనే పోలీస్ కుటుంబాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచ దేశాలే వణికిపోతున్నాయి. చైనా, ఆమెరికా, స్పెయిన్‌లో వేలాది మంది మరణించారు. మన దేశంలో ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్ ప్రకటించారు. వచ్చేనెల 14 వరకు ప్రజలెవరూ గడప దాటి బయటకు రావొద్దని ప్రకటించి, పెళ్లిళ్లు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ఆదేశించారు. అత్యవస పరిస్థితుల్లో బైక్ పై ఒక్కరు, ఫోర్ వీలర్‌పై ఇద్దరికే అనుమతి ఇస్తున్నారు. కానీ ప్రజల సంక్షేమం కోసం ఇంత చేస్తున్నాపోలీసులు తమ వరకు వచ్చే సరికి తప్పులో కాలేశారు. లాక్‌డౌన్ ప్రజలకే కానీ మాకు వర్తించదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మామూనూర్ ట్రైనింగ్‌లో 700 మందికిపైగా మహిళా కానిస్టేబుళ్లు, బెటాలియన్‌లో 250మంది పురుష కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. అదే విధంగా మడికొండ పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో సుమారు 250 మంది పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు.
దేశం గందరగోళ పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులకు శిక్షణ వివాదస్పదంగా మారింది. మామూనూర్ బెటాలియన్‌లో 700 మందికి పైగా శిక్షణ పొందుతుండగా సుమారు 200 పోలీస్ కుటుంబాలు అక్కడే నివాసం ఉంటున్నాయి. బెటాలియన్‌కు నిత్యం దోబీలు, బార్బర్లు, ఇతర పనుల నిమిత్తం పెద్ద సంఖ్యలో వస్తూ పోతుంటారు. ఈ క్రమంలో అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. బెటాలియన్‌లోకి వచ్చే వారికి స్ర్కీనింగ్ పరీక్షలు చేయడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్న ధాఖలాలు లేవని తెలుస్తోంది. అక్కడ నివాసం ఉంటున్న పోలీస్ కుటుంబాలు అధికారులకు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఆదేశాలు లేవని కొట్టి పారేస్తున్నట్లు సమాచారం.
Tags: Warangal, Mamunoor, Madikonda Police Training Center, Corona Virus, China. America