- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కౌంటింగ్ కేంద్రాల్లో నీళ్లు లేవు.. కుర్చీలు లేవు..
by Shyam |

X
దిశ ప్రతినిధి, మేడ్చల్: పోలింగ్ కౌంటింగ్ కేంద్రాల వద్ద వసతుల లేమితో ఏజెంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 150 డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపును 30 కేంద్రాలలో చేపడుతున్నారు.అయితే ఈ కేంద్రాలలో ఏజెంట్లకు, అభ్యర్థులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. కానీ పలు కేంద్రాలలో తాగేందుకు మంచినీరు, కూర్చునేందుకు సరిపడ కుర్చీలు అందుబాటులో లేవంటున్నారు. అదే విధంగా టాయిలెట్లు సైతం పలు కేంద్రాలలో అందుబాటులో లేవని పలువురు ఏజెంట్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కొన్ని కేంద్రాలలో ఫ్యాన్ లు పనిచేయడం లేదంటున్నారు.
Next Story