- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనం కోసమొస్తే.. ప్రాణాలే పోయాయి
దిశ, స్టేషన్ ఘన్పూర్: దొంగతనం చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని గుర్తించిన గ్రామస్తులు వెంటబడి తరమడంతో తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి దొంగ మృతి చెందాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్‌లో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. రెండ్రోజుల కిందట స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవపూర్ గ్రామంలోని డబుల్ బెడ్ ఇళ్ళలో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి యత్నించారు. అయితే, ఆ వ్యక్తులు కొత్తగా కనిపించే సరికి వారిలో ఒకరిని స్థానికులు పట్టుకుని వెంటనే పోలీసులకు అప్పగించారు. మరో ఇద్దిరిని గ్రామస్తులు పట్టుకునేందుకు యత్నించగా, అందులో ఒకరు పారిపోగా, మరొకరు తప్పించుకునే క్రమంలో జాతీయ రహదారి పక్కన ఉన్న బావిలో పడిపోయాడు. రెండ్రోజుల తర్వాత మృతదేహం పైకి తేలడంతో గమనించిన స్థానికులు పోలీసుల సాయంతో బయటకు తీశారు. మృతుడు హైదరాబాద్‌కు చెందిన ఉమర్‌గా గుర్తించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితున్ని విచారించగా సెటప్ బాక్సుల చోరీ కోసం వచ్చినట్లు వెల్లడించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.