- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
యువకుడికి సాయంత్రం అంత్యక్రియలు.. రాత్రి ఇంటికి..
దిశ, భద్రాచలం: చనిపోయిన యువకుడికి అంత్యక్రియలు చేసిన రాత్రే అతడు సజీవంగా ఇంటికి వచ్చాడు. అది చూసి అంతా షాక్ అయ్యారు. కొడుకు చనిపోయాడని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆ తల్లి ఆనందానికి అంతులేదు. విషాదపు కన్నీరు క్షణాల్లో ఆనంద బాష్పాలుగా మారినవి. దీపావళి పండుగ రోజు ఓ కుటుంబంలో నిజమైన వెలుగులు నింపిన ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని లింగాపురంపాడులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
క్రితం అదృశ్యం.. నేడు ప్రత్యక్షం
లింగాపురంపాడు గ్రామానికి చెందిన బొడ్డు ప్రసాద్ అనే యువకుడు ఐదు రోజులుగా కనిపించడం లేదని రెండు రోజుల క్రితం అతని తల్లి చంద్రమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇంతలోనే తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లో ఓ మగ మృతదేహం తేలియాడుతూ కనిపించినట్లుగా జాలర్లు చెలిమెల గ్రామస్థులకు చెప్పిన సమాచారంతో పోలీసులు వెళ్ళి రిజర్వాయర్‌లో గాలించి గుర్తుపట్టని విధంగా ఉన్న ఓ మృతదేహాన్ని వెలికితీశారు. అది ప్రసాద్ మృతదేహమే అని కుటుంబ సభ్యులు గుర్తించడంతో చర్ల పోలీసులు ఆ మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి భద్రాచలంలో పోస్టుమార్టం చేయించి ప్రసాద్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా కలిసి గురువారం (దీపావళి రోజు)సాయంత్రం చర్ల మండలం గుంపెనగూడెం సమీపంలోని తాలిపేరు వాగు ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. ఆ రాత్రే యువకుడు ప్రసాద్ సజీవంగా ఇంటికి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటివరకు విషాదంలో ఉన్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా ఆనందం నిండింది. ఈ ఇంట్లో విషాదం కథ ఇలా సుఖాంతమైంది. శుక్రవారం ఉదయం ప్రసాద్ పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి తన అదృశ్యానికిగల కారణాలు పోలీసులకు వివరంగా చెప్పినట్లు సమాచారం ఈ సంఘటనపై పోలీసులు అధికార ప్రకటన చేయాల్సి ఉంది.
తాలిపేరులో శవం ఎవరిది..?
చనిపోయాడనుకున్న ప్రసాద్ సజీవంగా తిరిగిరావడంతో పోలీసులు తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లో స్వాధీనం చేసుకున్న శవం ఎవరిది అనేది ప్రశ్నార్థకమైంది. చీరలో రాళ్ళుపెట్టి తాడుతో కట్టేసి ఉండటంతో అది హత్యా లేక ప్రమాదమా ? అనే కోణంలో ఇప్పటికే చర్ల పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాలిపేరులో చనిపోయింది ఈ ప్రాంత వ్యక్తేనా? లేక రిజర్వాయర్‌కి ఎగువన ఉన్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అప్పటివరకు ఆ మరణం మిస్టరీగానే మిగిలి ఉంటుంది.