- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో.. ఈ జంతువుల ధరలు చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
దిశ, ఫీచర్స్: సాధారణ కోడిపుంజులకు పందెంలో పాల్గొనే పుంజుకు తేడా ఉన్నట్లే వాటి ధరలోనూ వ్యత్యాసముంటుంది. సదర్ ఉత్సవంలో సత్తా చాటే దున్నపోతుల ధరలు చూస్తే వామ్మో అని నోరెళ్లబెట్టాల్సిందే. యూకేలో తరుచుగా జరిగే ‘బ్రీడర్’ షోలో ‘బిగ్ డేవ్’ అనే బాతును వేలం వేయగా, ఆశ్చర్యకరమైన రీతిలో 2070 డాలర్ల ధర పలకడం విశేషం. ఈ క్రమంలోనే భూమిపై ఉన్న అత్యంత విలువైన జంతువుల క్లబ్‌లో అది చేరిపోయింది. ఇంతకీ ఏ జీవులు ఆర్థికంగా అత్యంత విలువైనవి? అసలు జంతువులకు ఆర్థిక విలువ ఇవ్వాలా? జీవిస్తున్నా, శ్వాసించే జీవికి ధర పెట్టడం సరైందేనా? అంటే జంతువులతో మనుషులకు విడదీయరాని అనుబంధముంటుంది. కొన్నింటిని చూడగానే వాటితో ప్రేమలో పడిపోతాం. మరికొన్నింటిని కొనుక్కోవాలని ఆశపడుతుంటాం. రకరకాల కారణాలతో జంతువులను కొనడానికి ప్రజలు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అతి విలువైన యానిమల్స్ గురించి తెలుసుకుందాం.
కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ఒక బిలియన్ గొర్రెలు ఉండవచ్చు కానీ వాటిలో చాలా వరకు విలువైనవి కావు. అదే యూకేలో ‘డబుల్ డైమండ్’ అని పిలిచే ఓ ప్రత్యేకమైన గొర్రెపిల్ల ఉంది. దీనికి బంగారు ఉన్ని లేదు కానీ జన్యుశాస్త్రపరంగా అత్యంత విలువ కలిగి ఉండటం వల్ల అది 3.5 కోట్ల ధరకు అమ్ముడుపోయింది. ఇక డైమండ్ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్ పౌండ్‌లతో ‘హెక్సెల్ డాంగో’ అనే గొర్రె నిలిచింది. టెక్సెల్ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్ కోసం ఉపయోగిస్తుంటారు.
పశుసంపద..
ఆవులు, ఎద్దులు కూడా కళ్లు చెదిరే మొత్తానికి అమ్ముడుపోతుంటాయి. 2009లో మిస్సీ అనే ఆవును అత్యధికంగా 1,200,000 డాలర్లకు కెనడియన్ ఇన్వెస్టర్స్ కొనుగోలు చేశారు. హోల్‌స్టెయిన్ జాతికి చెందిన ఈ ఆవులు అత్యధిక పాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి. అయితే కెనడియన్ కంపెనీ మాత్ర ఆ జాతిని మరింతగా ఉత్పత్తి చేయాలనే ఆశతో మిస్సీని కొన్నారు. ఇక డోనాల్డ్ ట్రంప్‌నకు చెందిన వ్యవసాయ, గ్రామీణ సలహా కమిటీ చైర్మన్ ఉత్తర డకోటాలో జరిగిన వేలంలో ఒక సంవత్సరం వయసున్న అంగస్ ( SAV అమెరికా 8018) ఎద్దు కోసం $ 2.14 మిలియన్లు చెల్లించడం విశేషం.
పెట్ ప్రైసెస్..
సగటు పెంపుడు జంతువు కూడా కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు అధిక ధరలు పలుకుతున్నాయి. UK లో, మహమ్మారి సమయంలో కుక్కల ధర పెరిగింది. కొన్ని జాతుల కుక్కపిల్లలు ప్రస్తుతం మూడు వేల పౌండ్ల ($ 4,160)కు అమ్ముతున్నారు. ఆహారం, ఆస్పత్రి, ఇతర ఖర్చులను చేర్చినట్లయితే పెంపుడు జంతువుల యజమానులు పెట్ యానిమాల్స్ కోసమే భారీగా ఖర్చు చేస్తున్నారు. అయితే శునకం కోసం ఇప్పటివరకు చెల్లించిన అత్యధిక ధర 10 మిలియన్ చైనీస్ యువాన్. ‘బిగ్ స్ప్లాష్’ అనే టిబెటన్ మస్టిఫ్ కోసం ఈ మొత్తం చెల్లించారు. మస్టిఫ్ జాతి ఇటీవలి సంవత్సరాల్లో చైనాలో స్టేటస్ సింబల్‌గా మారింది.
శునకాలే రాజభోగాలకు అర్హులా? మాకేం తక్కువా అన్నట్లు మార్జాలాలు కూడా వయ్యారాలకు పోతున్నాయి. ఈ క్రమంలోనే అత్యంత ఖరీదైన దేశీయ జాతుల్లో ‘సవన్నా’ పిల్లి ఉండగా, అషేరా జాతి పిల్లులు 15 వేల డాలర్ల – 1,25,000 డాలర్ల విలువతో వరల్డ్ మోస్ట్ ఎక్సెపెన్సివ్ క్యాట్స్‌గా టాప్‌లో ఉన్నాయి. లైఫ్‌స్టైల్ పెట్స్ కంపెనీ ‘ఆషేరా’ పిల్లుల్ని అభివృద్ధి చేయగా, పదేళ్ల నుంచి వీటిని పరిమిత సంఖ్యలోనే విక్రయిస్తుంది. ఇక గిన్నిస్ ప్రకారం, అత్యంత వెల్తీయెస్ట్ క్యాట్ బ్లాకీ. 1988లో బ్లాకీ యజమాని తన 7 మిలియన్ ఆస్తిని ($ 9.7m/€ 8.2m) దాని పేరిటే రాశాడు. న్యూయార్క్‌కు చెందిన ఎల్లా వెండెల్ అనే రియల్ ఎస్టేటర్ తన 15మిలియన్ డాలర్ల ఆస్తిన తన పెట్ డాగ్ ‘టోబి’ పేరిట రాశాడు. సంపాదన పరంగా చూస్తే.. ఇంటర్నెట్ స్టార్ గ్రంపి క్యాట్ (అసలు పేరు తార్దార్ సాస్) అత్యంత ఖరీదైన పెంపుడు జంతువుల విభాగంలో నెంబర్‌వన్ స్థానంలో ఉంటుంది.
రేసింగ్ వ్యాల్యూ..
2020 చివరిలో చైనాలోని ఓ అనామక బిడ్డర్ ‘న్యూ కిమ్’ అనే పావురాన్ని € 1.6 మిలియన్ ($ 1.8m/£ 1.4m) కు కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఇదే అత్యధిక ఖరీదైన పావురంగా తొలిస్థానంలో ఉంది. కానీ ఈ విభాగంలో.. రేసు గుర్రాలు అత్యధిక ధరలను కలిగి ఉంటాయి. మెక్‌ల్రాత్ కెప్టెన్ జిమ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఇప్పటివరకు విక్రయించిన అత్యంత ఖరీదైన డ్రాఫ్ట్ హార్స్. రెండేళ్ల బెల్జియన్ స్టాలియన్ 20 ఫిబ్రవరి 2003న ఇల్‌నాయిస్‌లోని మిడ్-అమెరికా డ్రాఫ్ట్ హార్స్ సేల్‌లో ఇది $ 112, 500 (£ 69,400) ధరకు అమ్ముడుపోయింది. ఇక రేసింగ్ హార్స్ విషయానికి వస్తే.. ఫుసైచి పెగాసస్ 70 మిలియన్ డాలర్లు (£ 53.7 మిలియన్లు)కు అమ్ముడుపోయి చరిత్ర సృష్టించింది.