- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పని కోసం వెళితే.. ప్రాణాలు పోయాయి..
దిశ, పరకాల: పాత భవనం కూల్చడానికి వచ్చిన ఓ కార్మికుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై మరణించిన ఘటన పరకాల పట్టణంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బిల్ల హరీష్(30) పాత భవనాలు, డ్రైనేజ్ కాలువలు, రోడ్లు తదితరాలు డ్రిల్లింగ్ కట్టర్ సహాయంతో కూలుస్తుంటాడు. అదే క్రమంలో ఆదివారం ఉదయం పట్టణంలోని వసుంధర ఐరన్ హార్డ్వేర్ యజమాని అయిన ఆలేటి రాజేందర్ కు సంబంధించిన పాత భవనం కూల్చడం కోసం మరో ముగ్గురితో కలిసి హరీష్ పనికి వెళ్లాడు. స్లాబు పైకి ఎక్కి గోడను కూలుస్తున్న క్రమంలో డ్రిల్లింగ్ కట్టర్ పనిచేయకపోవడంతో ప్రదీప్ అనే తోటి కార్మికున్ని సుత్తి సహాయంతో గోడను పగుల గొట్ట మని చెప్పి తను కిందికి దిగి వెళ్తుండగా విద్యుత్ ఘాతానికి గురికావడం జరిగింది. వెంటనే స్పందించిన తోటి కార్మికులు విద్యుత్ కనెక్షన్ ఆపివేసి హరీష్ ను పరిశీలించగా స్పృహ తప్పినట్లు గమనించారు. వెంటనే హరీష్ ను పరకాలలోని సివిల్ ఆస్పత్రి తరలించగా హరీష్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దొంగల కోసం ఏర్పరచిన విద్యుత్ కంచేనా ప్రాణం తీసింది
వసుంధర ఐరన్ హార్డ్వేర్ యజమాని రాజేందర్ తన ఐరన్‌ను దొంగలు ఎత్తుకు పోకుండా ఉండటం కోసం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కొంచెం మూలంగానే హరీష్ విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడా అనే అనుమానాలు సైతం వినిపిస్తున్నాయి.
ఐరన్ షాపు ముందు మృతుడి కుటుంబ సభ్యుల నిరసన
వసుంధర ఐరన్ షాప్ ఓనర్ రాజేందర్ ఈ రోజు ఇంటికి వచ్చి తన పని పూర్తి చేయాల్సిందిగా హరీష్ కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హరీష్ ‘బిల్లింగ్ కట్టర్ బాగోలేదు నేను రాను’ అన్నప్పటికీ బలవంతంగా పనికి తీసుకు రావడం జరిగిందంటు మృతుడి భార్య కావ్య ఆరోపిస్తోంది. భర్త బలవంతంగా వెంటబెట్టుకుని వచ్చి నా భర్త మరణానికి కారణమయ్యారంటూ కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. హరీష్ మృతికి కారణమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు హరీష్ కుటుంబానికి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ, మృతదేహంతో రాజేందర్‌కు చెందిన ఐరన్ షాప్ ముందు ధర్నాకు దిగారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ విషయమై పోలీసుల వివరణ కోసం ఫోను ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.