- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సర్పంచ్ ఎదుటే.. మహిళ ఆత్మహత్యాయత్నం
దిశ, కోదాడ: సర్పంచ్ ఎదుటే ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్ల గ్రామంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి వెళితే.. గ్రామంలో రైతు అమరబోయిన రామారావుకు సర్వే నెంబర్ 342లో ఐదెకరాల భూమి ఉంది. దీని పై భాగంలో ఒక ఎకరం భూమిని ఈ మధ్యనే కొనుగోలు చేసిన గ్రామ సర్పంచ్ కాసాని వెంకటేశ్వర్లు రామారావు భూమిలోనికి వెళ్లడానికి దారిని తన పొలం గుండా ఇవ్వబోనని అన్నారు. దీంతో పొలం వద్ద ఇరువురికి గొడవ జరిగింది. దీంతో సర్పంచ్ దౌర్జన్యం సహించలేక రామారావు తల్లి సర్పంచ్ ఎదుటే క్రిమిసంహారక మందు తాగింది. దీంతో పొలం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం బాధితులు మాట్లాడుతూ… గత నలభై ఏండ్ల క్రితం ఇట్టి భూమిని తాము కొనుగోలు చేశామని, ఇప్పుడు మా పొలం పై భాగంలో ఎకరం పొలం కొనుగోలు చేసిన సర్పంచ్ తమ పొలం నుంచి దారి ఇవ్వబోనని గత మూడు నెలలుగా దౌర్జన్యాలు చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా పొలం నుంచి దౌర్జన్యంగా జేసీబీతో కందకం కొట్టిస్తుండగా, అడ్డు చెప్పిన మాపై విచక్షణా రహితంగా దాడి చేశారని వాపోయారు. గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్‌గా గెలిపిస్తే, మా భూములపై దౌర్జన్యాలు చేస్తూ కబ్జాలు దిగుతున్నాడని అన్నారు.