Special Day: అడవి దున్నకు కొమరం భీమ్‌గా నామకరణం

by Shyam |
wild buffalo
X

దిశ, చార్మినార్: జూ పార్కులో జన్మించిన నూతన జంతువులకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూ ఉన్నతాధికారులు శనివారం నామకరణం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున అడవి దున్నకు, పక్షం రోజుల క్రితం ఖడ్గ మృగం పిల్లలకు జన్మనిచ్చాయి. వెటర్నరీ వైద్యుల పరిరక్షణలో ఉంచిన ఆ పసికూనలకు ఈ రోజు నామకరణం చేశారు. అడవి దున్నకు తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ అని, ఖడ్గ మృగానికి నంద అని నామకరణం చేశారు. వాటికి కేటాయించిన ఎన్ క్లోజర్‌లలో వాళ్ళ తల్లుల దగ్గరికి కొమురం భీమ్, నందను వదిలారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా జూపార్కులో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జూ అధికారులు ఆర్. శోభ, ఆర్ఎం దొబ్రియాల్, సి థానంద్ కుక్రెట్టి, ఎం జె అక్బర్, క్యూరేటర్ సుభద్రా దేవి, డాక్టర్ ఎంఏ హకీమ్, నాగమణి, హనీవుల్లా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed