తండాలో మహిళల ఆందోళన.. ఎందుకంటే ?

by Shyam |
water
X

దిశ, పరిగి : మంచినీటి సమస్యను పరిష్కరించడంలో పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సాలిపలబాట తండా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిగి మండలం సాలిపలబాట తండా గ్రామ పంచాయతీ ప్రజలు మంగళవారం హైవే రోడ్డుపై బిందెలతో ధర్నా నిర్వహించారు. తండాకు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ చెడిపోయి వారం రోజులవుతున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతూ హైవే రోడ్డుపై మహిళులు నిరసన వ్యక్తం చేశారు. అరగంట పాటు హైవే రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. హైవే రోడ్డుపై అటుగా వెళ్తున్న కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి తండావాసులతో మాట్లాడి ట్రాన్సఫార్మర్కు వెంటనే కనెక్షన్ ఇచ్చేలా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తో మాట్లాడారు.

వెంటనే టీఆర్ఎస్ నాయకులు, పరిగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తండా వాసులను సముదాయించి విద్యుత్ అధికారులతో మాట్లాడి వెంటనే ట్రాన్స్ఫార్మర్ బుడ్డీలకు కనెక్షన్ ఇవ్వాలని కోరారు. సర్పంచ్ తనయుడు రమేష్ పై తండావాసులు ఆందోళన దిగితేగాని విద్యుత్ అధికారులు స్పందించరా అంటూ మండిపడ్డారు. ట్రాన్స్ ఫార్మర్కు సంబంధించి మెటీరియల్ అంతా తెచ్చి ఉంచినా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే సమస్య జఠిలమైందన్నారు. గ్రామానికి తాగేందుకు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నా ఆ నీరు తాగడం వల్ల చర్మ సమస్యలు తలెత్తుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రానికి ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో సమస్య తీరిందని తండా వాసులు సంతృప్తి చెందారు.

Advertisement

Next Story

Most Viewed