- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
భద్రాద్రిలో గోదావరి పెరుగుతోంది!
by Sridhar Babu |

X
దిశ, ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. గురువారం ఉదయం 5 గంటలకు 42.6 అడుగుల వద్ద ప్రవహిస్తున్న గోదావరి.. 7 గంటలకు 43.50 అడుగులకు పెరిగింది. రెండు రోజులుగా సుమారు 19 అడుగులు తగ్గిన నీటి మట్టం మళ్ళీ పెరుగుతుండటంతో తీర ప్రాంత ప్రజలు, రైతాంగం ఆందోళనలో ఉన్నారు.
బుధవారం సాయంత్రం నుంచి వర్షం పుంజుకోవడంతో గోదావరిలోకి వాగుల నుంచి ప్రవాహం కొనసాగుతోంది. దీంతో గోదావరి నీటి మట్టం మళ్లీ పెరగనున్నదని స్పష్టమవుతోంది. పునరావాస కేంద్రాల నుంచి బుధవారం కొంతమంది ప్రజలు సొంతూళ్లకు చేరుకున్న గంటల వ్యవధిలోనే గోదావరి ఉధృతి పెరుగుతుండటంతో వారిలో ఆందోళన మొదలైంది.
Next Story