- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కలం పట్టే చేత్తో.. పార పట్టిన విద్యావంతులు

దిశ, బోథ్: పైన ఫోటోలో నిల్చున్న వాళ్ళందరూ చేతిలో డిగ్రీ, పీజీ పట్టా పొందిన యువ విద్యావంతులు జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో అనేక డిగ్రీలు చేశారు. కొలువులు సాధించి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ఎన్నో కలలు కన్నారు. కానీ.. ప్రభుత్వం వీరి ఆశలన్నీ అడియాశలు చేస్తోంది. నోటిఫికేషన్‌లు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో వీరందరూ చేసేదేంలేక, కుటుంబ పోషణ కోసం ఉపాధి హామీ పనుల బాట పట్టారు. దీనికి తోడు ప్రభుత్వం ఉద్యోగ పదవి విరమణ వయస్సు మరో 2 సంవత్సరాలు పెంచడంతో ఉన్న ఆశలు కూడా వదిలేసి ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లి, తల్లిదండ్రులు వీరిపై చేసిన అప్పుల వడ్డీలు కడుతున్నారు. కనీసం పట్నం పోయి ఏదైనా పనిచేసుకుందామంటే మాయదారి కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కుటుంబాలు ఛిద్ర అయ్యే పరిస్థితి నెలకొంది. వీరందరూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి చెందిన నిరుద్యోగులు.