‘సాగర్’ కౌంటింగ్: ఆధిక్యంలో అధికార పార్టీ

by Shyam |
‘సాగర్’ కౌంటింగ్: ఆధిక్యంలో అధికార పార్టీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో జరిగిన నాగర్జునాసాగర్ ఉప ఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఎన్నికల కౌంటింగ్ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే మొదటి రౌండ్ ఫలితాలు వెలవడగా, మొదటి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 4,228, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి 2,753 ఓట్లు నమోదు అయ్యాయి. దీంతో మొదటి రౌండ్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మొత్తం 25 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఫలితం తేలే వరకు సాయంత్రం నాలుగు గంటలు అవుతుందని అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story