- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పట్టణవాసుల పల్లెబాట @ లాక్‌డౌన్
దిశ, న్యూస్ బ్యూరో : ‘ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది’ అనేది మనకు చిరపరిచితం. ఇప్పుడు కరోనా కారణంగా వచ్చిన లాక్‌డౌన్ కూడా చాలామంది జీవితాలను తాత్కాలికంగానైనా మార్చేసింది. సిటీలో సెటిలైనవారు పల్లెబాట పట్టారు. క్షణం తీరిక లేకుండా గడిపిన జీవితాలు ఇప్పుడు ప్రశాంతతను ఆస్వాదిస్తున్నాయి. నిత్యం పైళ్లపై కదిలే వేళ్ళు ఇప్పుడు పొలంపని చేస్తున్నాయి. పక్కనున్న మనిషితో కూడా మాట్లాడలేనంత బిజీ లైఫ్ ఇప్పుడు చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునేలా చేసింది. పట్నంలో కనిపించే పొల్యూషన్ లేదు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటున్నారు. వాహనాల రొద స్థానంలో పక్షుల కిలకిలారావాలను, కోడి కూతలను వింటున్నారు. బైక్‌లు, కార్లు నడపడానికి అలవాటు పడిన కాళ్ళు ఇప్పుడు ఇంటికి, పొలానికి మధ్య కాలిబాటన తిరుగుతున్నాయి.
స్వస్థలాలకు వెళ్ళలేని వలస కార్మికుల వ్యధలు, బాధలు ఎలా ఉన్నా తెలంగాణలోని పల్లెవాసులు బతుకుతెరువు కోసం పట్నమొచ్చి ఇప్పుడు లాక్‌డౌన్ కారణంగా మళ్ళీ పల్లెబాట పట్టారు. వారి జీవితాల్లో ఊహించని మార్పును లాక్‌డౌన్ తీసుకొచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూర్(ఎం) మండలం రాఘవాపురానికి చెందిన సోమ రమణారెడ్డి ఆర్కిటెక్చర్ విద్య పూర్తి చేశారు. సొంతంగా ఎదగాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లో 20 మందితో ఓ కంపెనీ ప్రారంభించి, తనతోపాటు పలువురికి ఉపాధి కల్పిస్తున్నారు. రోజంతా బిల్డింగ్‌ల డిజైన్, కస్టమర్లతో మీటింగ్‌లు, సైట్ విజిట్‌లు. రోజూ ఉదయమే ఇంటి నుంచి బయటకు వెళ్లింది మొదలు ఆఫీస్, కార్లు, సైట్స్ విజిటింగ్‌లతో ఇంటికి ఏ అర్ధరాత్రోగానీ చేరుకునేవారుకాదు. లాక్‌డౌన్ ప్రకటన తర్వాత ఆయన జాబ్ ప్రొఫైల్ పూర్తిగా మారిపోయింది. కుటుంబంతో పాటు సొంతూరికి చేరుకున్నారు. తాత, నానమ్మ, బంధువులతో వారి పిల్లలు ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఇల్లు సందడిగా మారిపోయింది. రమణారెడ్డి దృష్టి ఇప్పుడు వ్యవసాయం మీద పడింది. సిటీలో ఎప్పుడూ బిజీగా ఉండడం అలవాటై ఇప్పుడు ఊరిలో ఖాళీగా ఉండలేకపోతున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. చేపలు, గడ్డి పెంపకం లాంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు వరి కోతల సమయం కావడంతో వరి కోత మిషన్లను రప్పించడం, గడ్డివాము వేసుకోవడం వంటి పనుల్లో తండ్రికి సాయపడుతున్నారు. పిల్లలకు వ్యవసాయాన్ని పరిచయం చేయడంతోపాటు గ్రామంలోని వారినీ పరిచయం చేస్తూ గడుపుతున్నారు.
రమణారెడ్డి ఒక్కరే కాదు.. ఇలాంటి ఉదాహరణలు ప్రతీ జిల్లాలో, ఊరిలో ఇప్పుడు తారసపడుతున్నాయి. లాక్‌డౌన్‌తో వారి జీవన విధానమే మారిపోయింది. గ్రామంలో ఉంటూ చేతనైన పనులు చేసుకుంటూ గడుపుతున్నారు. ఎనిమిది గంటల పనివిధానం, ప్రత్యేక డ్రెస్ కోడ్, కస్టమర్లతో బిజీబీజీ మంతనాలు, బోర్డు మీటింగ్‌లు, టీమ్ లీడింగ్, మేనేజ్‌మెంట్.. ఇవన్నీ మొన్నటి వరకూ కార్పొరేట్ వ్యవస్థలో కనిపించిన దృశ్యాలు. కంపెనీ, సంస్థ ఏదైనా ప్రత్యేకమైన వర్క్‌స్టైల్ ఉండేది. ఏసీలు, ఫ్యాన్లు కింద కూర్చుని పనిచేసేవారు. మార్కెటింగ్, ఫీల్డ్ డ్యూటీలైతే కస్టమర్లను కలిసేందుకు రోడ్ల మీద చక్కర్లు. ఒక్క దెబ్బతో వీటన్నింటికీ కరోనా బ్రేక్ వేసింది. కంపెనీ డ్రెస్‌కోడ్, ఫార్మల్, యూనిఫాంలతో బాసులు, టీం లీడర్లు, మేనేజర్లుగా కింది వారితో నమస్తేలు చెప్పించుకున్నవారంతా ఇప్పుడు మాయమైపోయారు.
లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో వారంతా గ్రామాల బాట పట్టారు. మళ్లీ వారి పూర్వాశ్రమంలోని పనుల్లో సాదాసీదా దుస్తులతో రోజులు గడుపుతున్నారు. పైస్థాయి ఉద్యోగులు, వ్యాపారులే కాదు.. ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మార్కెటింగ్ ఎంప్లాయీస్.. గత 20 రోజులుగా ఇలాంటివారి డెయిలీ వర్క్, డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయాయి. సొంతంగా భూములు లేని ఉద్యోగులు, విద్యార్థులు ఆన్‌లైన్ లేదా ఇండోర్ ఆటలతో పల్లెల్లో కాలక్షేపం చేస్తున్నారు. లాక్‌డౌన్ రోజులు ఆర్థికంగా భారమవుతున్నప్పటికీ, సొంత ఊర్లలోని కుటుంబాలు, మిత్రులతో కలిసే ఉండే అవకాశం కల్పించింది. ఎవరి ఉద్యోగాల్లో, జీవితాల్లో బిజీగా మారిపోయిన వారంతా ఒక్క దగ్గరికి చేరిపోయారు. బాల్యం, విద్యార్థి దశలో, వారి జీవితాల్లోని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కంపెనీ టర్నోవర్లు, జీతభత్యాల లెక్కలు వేసుకున్న వారంతా ఈ రోజులను కుటుంబ సభ్యుల మధ్య గ్రామీణ వాతావరణంలో గడుపుతున్నారు. ఉపశమనం పొందుతున్నారు. లాక్‌డౌన్ పుణ్యమా అని స్వగ్రామాలకు చేరుకున్నారు. ఉన్నత విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు ఒక్కసారిగా పక్కకు తప్పుకున్నాయి.
వాహనాల రోద లేదు. ట్రాఫిక్ జాంలు, ఆర్థిక ప్రణాళికలు అసలే లేవు. బయటకు వెళ్తే ఎంత ఖర్చవుతుందోననే ఆందోళన లేదు. రోడ్ మీదకు వెళ్తే తిరిగి వస్తామో లేదోననే భయం అసలే లేదు. ఈ రోజు ఎలా గడుస్తుందోననే టెన్షన్ లేదు. కరోనాతో ప్రాణభయం ఎంత ఉన్నా.. గ్రామాల్లోకి చేరిన వారు మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు. ఆఫీసులు, వ్యాపారులు పక్కకు పోయి వారి జీవితాల్లో వ్యవసాయం, వ్యాపకాలు, మంతనాలు, కాలక్షేపాలు చేరిపోయాయి. ఆర్థికంగా, సామాజిక స్పృహ ఉన్నవారు దాతల సహాయంతో లాక్‌డౌన్ ఇబ్బందులు పడుతున్నవారికి సహాయం చేస్తున్నారు. మాస్క్‌లు పంపిణీ చేయడం, కూరగాయలు అందించడం, భోజనం సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఉద్యోగాల్లో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నవారంతా రిలాక్స్ టైం ఎంజాయ్ చేస్తున్నారు.
మిత్రులతో గడిపేందుకు సమయం దొరికింది..పూసల లింగం గౌడ్, స్కూల్ కరస్పాండెంట్, సంగారెడ్డి
”సంగారెడ్డిలోని బీవీఎం స్కూల్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాను. ఉదయం ఎనిమిదింటికల్లా స్కూల్‌కు చేరుకుంటే తిరిగి ఇంటికొచ్చేటప్పటికి రాత్రి ఎనిమిదయ్యేది. క్లాస్‌లు, ఫీజులు, తల్లిదండ్రులతో మాట్లాడటం, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సలహాలు, షెడ్యూల్ ఇవ్వడం, ఎగ్జామ్స్, ఇతర పనులతో తీరిక లేకుండా ఉండేది. కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో మాట్లాడేందుకు సమయం కూడా దొరికేది కాదు. లాక్‌డౌన్ తర్వాత నా దినచర్య మారిపోయింది. ఊరిలో నాకు మూడు ఎకరాల భూమి ఉంది. మా క్లాస్‌మేట్‌కే కౌలుకు ఇచ్చా. ఇప్పుడు నా ఊరిలో నా చిన్ననాటి స్నేహితులందరితో పాత జ్ఞాపకాలను నెమరేసుకునే అవకాశం దొరికింది”.
వ్యవసాయంలోనే గడిచిపోతుంది : శ్రీకాంత్, లెక్చరర్, కోమలంచ, నిజామాబాద్
”చదువుకునేటపుడు కుటుంబానికి సహాయంగా వ్యవసాయంలో పనిచేసేది. ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో కామర్స్ లెక్చరర్‌గా పనిచేస్తున్నా. క్లాస్‌లు చెప్పేందుకు ముందస్తుగా ప్రిపేర్ అవ్వడం, రిఫరెన్స్‌లు సిద్ధం చేసుకోవడం, ఉదయాన్నే కాలేజీకి వెళ్తే రోజంతా క్లాసులతోనే సరిపోయేది. సబ్జెక్టుల్లో విద్యార్థులకు వచ్చే సందేహాలను తీర్చడం, కొత్తగా వస్తున్న అంశాలను పరిశీలించి అధ్యయనం చేయడం, కుటుంబంతో కొంత గడపడంతో రోజంతా గడిచిపోయేది. లాక్‌డౌన్ ప్రకటించడంతో కుటుంబాన్ని తీసుకుని సొంతూరికి వచ్చేశాను. వ్యవసాయ పనులు తెలుసు కాబట్టి వాటిలో పడ్డాను. వరికి నీళ్లు పెట్టడం, కోతకు వచ్చిన పంటను కోస్తున్నాం. ఎఫ్‌సీఐ మార్కెట్ ఊర్లకే వస్తుంది. అందుకోసం వడ్లను ఎండబెట్టడం, వాళ్లతో మాట్లాడటం చేస్తున్నాం.
Tags: telangana, job, profession, lockdown, aggiculture