- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఉద్యోగుల లెక్క తేలింది
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అన్ని శాఖలు, విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య లెక్క తేలింది. 32 శాఖలు, వాటి కింద పనిచేస్తున్న అనుబంధ విభాగాల నుంచి వివరాలను సేకరించిన పీఆర్సీ చివరకు 4,91,304 శాంక్షన్డ్ పోస్టులు ఉన్నాయని గుర్తించింది. ఈ నివేదిక రూపొందించే సమయానికి (2020 డిసెంబరు) 3,00,178 మంది పనిచేస్తున్నారని, ఇంకా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది.
అత్యధికంగా విద్యాశాఖలో 1.37 లక్షలు, ఆ తర్వాత హోంశాఖలో 98,394 పోస్టులు, వైద్యారోగ్య శాఖలో 52,906 పోస్టులు ఉన్నాయని నివేదికలో పేర్కొంది. ఈ మూడు శాఖలతో పాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు, వాటికింద ఉన్న అనుబంధ విభాగాలలోని శాంక్షన్డ్ పోస్టులను కూడా పరిగణనలోకి తీసుకుంటే సుమారు 70 % (69.80%) ఈ ఐదు శాఖలలోనే ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద శాంక్షన్డ్ పోస్టులలో 61% మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన 39% ఖాళీలే.
అప్పుడు వివరాలు ఇవ్వకున్నా
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మంజూరైన పోస్టులు, పనిచేస్తున్నవారి సంఖ్య, ఖాళీగా ఉన్న పోస్టులు, ఐదేళ్లలో పదవీ విరమణ చేసినవారి సంఖ్య లాంటి వివరాలను సమాచార హక్కు చట్టం కింద కోరినప్పటికీ ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరించింది. చివరకు పీఆర్సీ నివేదిక ద్వారా పోస్టుల వివరాలు ఒక మేరకు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్ర జనాభాను పరిగణనలోకి తీసుకుంటే అత్యధికంగా 1.40% మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే, ప్రతి లక్ష మందికి 1,690 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని లెక్క. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలలోని జనాభాను, అక్కడి ఉద్యోగుల శాంక్షన్డ్ పోస్టులను పరిగణనలోకి తీసుకుని పీఆర్సీ లెక్కలు వేసింది.
తెలంగాణ నాలుగవ స్థానం
ఆ ప్రకారం పెద్ద రాష్ట్రాలలో తెలంగాణ ఎక్కువ మంది ఉద్యోగులతో నాలుగవ స్థానంలో ఉంది. అత్యధికంగా పంజాబ్‌లో 1.77%, మహారాష్ట్రలో 1.69% మంది, తమిళనాడులో 1.66% చొప్పున ఉన్నారు. ఆ తర్వాతి స్థానం తెలంగాణదే. నాగాలాండ్ (4.09%), హిమాచల్‌ప్రదేశ్ (3.16%), జమ్మూకశ్మీర్ (3.59%), గోవా (2.87%) లాంటి ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ పర్వత ప్రాంతాలుగా గుర్తింపు పొందిన రాష్ట్రాల జనాభాతో పోలిస్తే ఇక్కడ ఉద్యోగులు కాస్త ఎక్కువే ఉన్నారు. అతి తక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఆరు కోట్లకుపైగా జనాభా ఉంటే కేవలం 1.85 లక్షల శాంక్షన్డ్ పోస్టులు మాత్రమే (0.31%) ఉన్నాయి. ఆ తర్వాత బీహార్‌లో పది కోట్లకు పైగా జనాభా ఉంటే కేవలం 3.65 లక్షల పోస్టులు (0.35%) మాత్రమే ఉన్నాయి.