- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రంపై ఆశలు వదులుకున్న తెలంగాణ సర్కార్
దిశ, తెలంగాణ బ్యూరో : ‘టీకా ఉత్సవ్‘ పేరుతో మే నెల 1వ తేదీ నుంచి వయోజనులందరికీ వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించినా అది కొన్ని రాష్ట్రాల్లోనే అమల్లోకి వచ్చింది. తగినన్ని వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో చాలా రాష్ట్రాలు ఇంకా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనే లేదు. దేశంలో ప్రస్తుతం సీరం ఇన్‌స్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలు మాత్రమే వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్నందున నెలకు గరిష్ఠంగా ఏడు కోట్లకు మించి అందుబాటులోకి రావడం లేదు. కేంద్రం తగినంత మోతాదులో సరఫరా చేయగలుగుతుందని రాష్ట్రాలకు నమ్మకం లేదు. దీంతో గ్లోబల్ టెండర్లకు వెళ్ళడమే ఏకైక మార్గమని భావించింది.
థర్డ్ వేవ్ తప్పదంటూ వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అప్పటికల్లా కనీసంగా 70 శాతం మందికి వ్యాక్సిన్‌లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ తరహాలో వ్యాక్సినేషన్ ఇవ్వాలంటే మానవ వనరులు, ఏర్పాట్లు, వ్యాక్సినేటర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నా చేతిలో వ్యాక్సిన్లు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. దీంతో కేవలం రెండు కంపెనీలపై మాత్రమే ఆధారపడితే లాభం లేదని భావించిన ఉత్తరప్రదేశ్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు మెట్రో నగరాల మున్సిపల్ కార్పొరేషన్లు కూడా విడిగా గ్లోబల్ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లను సమకూర్చుకోవాలని భావించాయి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని వయసుల వారికీ ఉచితంగానే వ్యాక్సిన్లను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా తగినన్ని డోసులు లేకపోవడంతో ఆ ప్రక్రియను మొదలుపెట్టలేదు. సెకండ్ వేవ్ కంట్రోల్ కావడం లేదన్న ఉద్దేశంతో లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్న ప్రభుత్వం థర్డ్ వేవ్‌ను ఎదుర్కోడానికి సిద్ధమవుతోంది. వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి వ్యాక్సిన్ భేషైన మార్గంగా ఉంటుందని భావించినా అది సాధ్యం కాకపోవడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం అనివార్యంగా మారింది.
కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకోవడంకంటే విదేశాల నుంచి కొనుక్కోవడమే ఉత్తమమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో గ్లోబల్ టెండర్ల ప్రక్రియను ఖరారు చేయనున్నారు.