- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తాజ్’లో తొలిసారి ఏమైందంటే!
దిశ, వెబ్‌డెస్క్:
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దాని బారిన పడకుండా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగా ఆగ్రాలోని తాజ్‌మహాల్‌ను మూసివేయడం జరిగిందన్న విషయం విదితమే. ఈ మూసివేత ఈ నెల 31 వరకు కొనసాగనున్నది. మరో మూడు రోజుల తర్వాత మార్చి 21 నుంచి మూడు రోజులపాటు జరిగే ఉర్సు ఉత్సవాలు కూడా రద్దయ్యాయి. తాజ్‌మహాల్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. అయితే ఉర్సు ఉత్సవాలు జరిగే సమయంలో పర్యాటకులతో ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కళకళలాడుతూ ఉంటది. కానీ, కరోనా కారణంగా దానిని మూసివేయడంతో ఇప్పుడు ఆ ప్రాంతమంతా బోసిపోయి కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో సుమారు 30 వేల మంది వరకు తాజ్‌ను సందర్శిస్తుంటారు. దీంతో ఆ ప్రాంతమంతా పర్యాటకులు, ఇతరులతో ఎప్పుడూ కూడా కిటకిట నెలకొంటది. ఆదాయపరంగా కూడా ఆగ్రా డెవలెప్‌మెంట్ అథారిటీకి టికెట్ల అమ్మకాల ద్వారా రోజుకు కోట్లలో ఆదాయం సమకూరుతుంటుంది. అక్కడ ఉండే ఫొటోగ్రాఫర్స్, గైడ్ లు, టాక్సీ డ్రైవర్లు, హోటల్ వాళ్లతోపాటు పలువురికి కూడా పని దొరికి అంతోఇంతో ఆదాయం సమకూరేది కానీ, తాజ్ మహల్ మూసి ఉండండంతో వాళ్లకు కష్టకాలమొచ్చింది. మొత్తంగా అక్కడ అనిశ్చితి కొనసాగుతున్నది. ఇందుకు సంబంధించి.. తాజ్ మూసివేత కారణంగా పరిస్థితి దెబ్బతినే అవకాశమున్నదని, కాకపోతే ప్రస్తుత సమయంలో తప్పదని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు చెబుతున్నట్లు సమాచారం.
Tags: Taj Mahal, coronavirus, Agra mayor, 14 crore, no work