- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహితురాలి ఇంటిలో చిక్కుకున్న యువతి.. చివరికి ఇంటికి చేరింది
దిశ, మెదక్: లాక్‌డౌన్ కారణంగా పొరుగు రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఓ యువతి సోమవారం ఇంటికి చేరుకుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన ఆశా కార్యకర్త అమృత పెద్ద కుమార్తె స్వాతి రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని భగవంత్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్ చదువుతోంది. మార్చిలో సెలవులకు ఇంటికి వచ్చిన స్వాతి స్నేహితురాలిని చూడడానికి కడప జిల్లా రాజంపేట వెళ్ళింది. అయితే, అక్కడ ఉండగానే లాక్‌డౌన్ ప్రకటన వెల్లడైంది. కళాశాలకు సైతం సెలవులు ప్రకటించినట్లు స్నేహితుల ద్వారా స్వాతి తెలుసుకుంది. ఇంటికి వెళ్లిపోదామని అనుకునేలోపే రవాణా సదుపాయాలు రద్దు కావడంతో 28 రోజులపాటు రాజంపేటలోని స్నేహితురాలి ఇంట్లో ఉండిపోయింది. చివరకు మంత్రి హరీశ్‌రావు చొరవ తీసుకుని రవాణా సదుపాయం కల్పించడంతో స్వగ్రామం సిద్దిపేటకు
క్షేమంగా చేరుకుంది.
tag: lockdown, student, harish rao, home, siddipet