- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దారుణం.. తండ్రిని చంపిన తనయుడు
దిశ, నాగర్ కర్నూల్: రోజూ తాగి వచ్చి గోడవ పడుతున్న భర్తకు భయం చెప్పాలని పోలీసులను ఆశ్రయించగా పట్టించుకోలేదు. తీరా క్షణికావేశంలో ఆ కుటుంబ పెద్దను సభ్యులే దారుణంగా కొట్టి చంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కోడెరు మండల కేంద్రంలో బుధవారం వెలుగు చూసింది. రోజూ మద్యం మత్తులో కుటుంబ సభ్యులను, కన్న తల్లిని గాయపరుస్తూ మానసికంగా శారీరకంగా వేధించడంతో తండ్రి అని కూడా కనికరం చూపకుండా కర్రలతో బాది హతమార్చారు. భార్య నీలమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. కోడెరు గ్రామానికి చెందిన కొడేండ్ల కురుమయ్య(45)కు ఇద్దరు కుమార్తెలు, ఓ కొడుకు ఉన్నాడు. తండ్రి తరచూ మద్యం సేవించి ఇంట్లో గొడవ పెట్టుకోవడంతో రెండు రోజుల క్రితం భార్య నీలమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఒకసారి భయం చెప్పి న్యాయం చేయాలని పోలీసులును వేడుకుంది. వారు స్పందించకపోవడంతో నాపైనే ఫిర్యాదు చేస్తారా అని కురుమయ్య మళ్లీ మంగళవారం రాత్రి కూడా మద్యం తాగి భార్య పిల్లలతో గోడవపడ్డారు. తండ్రి కొడుకు మధ్య గొడవ పెరిగింది. దీంతో క్షణికావేశంలో ఇద్దరు రాళ్లు, కట్టెలతో కొట్టుకున్నారని, ఉదయం చూసేసరికి భర్త చనిపోయడాని ఆమె తెలిపింది. సంఘటన స్థలానికి సీఐ వెంకట్ రెడ్డి, ఇంచార్జి ఎస్సై నాగన్నలు పరిశీలించారు. మృతుడి తండ్రి చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ కుటుంబానికి కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఘోరం జరిగేది కాదని స్థానికులు చెబుతున్నారు