- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యతో కలిసి.. తల్లిని గెంటేసిన కొడుకు
దిశ, కామారెడ్డి: నవమాసాలు కడుపులో మోసి కనిపెంచిన తల్లిపై కన్నకొడుకే కర్కషంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత వృద్ధురాలి వివరాల ప్రకారం.. చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన భీమవ్వకు ముగ్గురు కుమారులు ఉన్నారు. గతంలో పెద్ద కొడుకు, రెండో కొడుకు మృతిచెందారు. చిన్న కొడుకు రాజు, అతని భార్య భారతి చిన్నమల్లారెడ్డిలో నివాసం ఉంటున్నారు. వారు నివాసం ఉండే ఇంటి పక్కనే వేరుగా భీమవ్వ జీవనం కొనసాగిస్తోంది.
గత కొన్నేండ్ల క్రితం తల్లికి ఉన్న భూమిని కొడుకు రాజు వేధింపులకు గురిచేసి లాక్కున్నాడు. ఆమెకు వచ్చే నెల నెలా పింఛను సైతం తీసుకుంటున్నాడు. అంతేగాకుండా.. ఇంట్లోంచి వెళ్లిపో అంటూ.. కొడుకు రాజు, కోడలు భారతీలు రోజూ భీమవ్వను చిత్రహింసలకు గురిచేయసాగారు. అప్పుడప్పుడు ముసలవ్వపై చేయి చేసుకొని, నరకం చూపించారు. అయినా.. ఎంతకీ ఆమె ఇంట్లోంచి వెళ్లకపోవడంతో మంగళవారం ఇంట్లోంచి గెంటేశారు. దీంతో భీమవ్వ రోధిస్తూ దేవునిపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె కన్నీటి బాధను చూసిన పోలీసులు గ్రామానికి చేరుకొని కొడుకు రాజు, కోడలు భారతీలకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి తల్లి పట్ల ఇలా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.