విషాదం నింపిన పండుగ.. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ తనయడు..

by Aamani |
విషాదం నింపిన పండుగ.. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ తనయడు..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : దీపావళి పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి అంత్యక్రియలకు వెళ్తూ తనయుడు మృతి చెందిన ఘటన నిజమాబాద్ జిల్లా కేంద్రంలోని కసాబ్ గల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మాజీ సింగిల్ విండో చైర్మన్ కౌడపూ భూమయ్య పటేల్ సోదరిమణి నాంచారి గంగుబాయి అనారోగ్యంతో బుధవారం సాయంత్ర సమయంలో తుది శ్వాస విడిచింది. అయితే సదరు గంగుబాయి అంత్యక్రియల కోసం వెళ్తుండగా ఆమే కుమారుడు నాంచారి శ్రీనివాస్ ఊహించని రీతిలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మార్గమధ్యలోనే కుప్పకూలిపోయాడు. దీంతో పక్కనే ఉన్న వారు ఆస్పత్రికి తరలించగా అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒకే రోజు తల్లీకొడుకు మృతి చెదడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ హృదయ విదాయకర ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Advertisement

Next Story

Most Viewed