- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అది ఎందుకు పెట్టుకున్నాడో తెలుసా..?
దిశ ప్రతినిధి, మహబూబ్నగర్: ప్రతిరోజు చేనేత, తెల్లని వస్త్రాలు ధరిస్తూ అప్పుడప్పుడు మెడలో టవల్ వేసుకొని కనిపించే రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శీనన్న అందుకు భిన్నంగా తలపై టోపీ ధరించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రతిరోజు టోపీ ధరించి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆ టోపీ వెనక ఉన్న మర్మం ఏమిటబ్బా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై దిశ సేకరించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రి శీనన్న తలపై లైట్ పురుగు కుట్టడంతో వెంటనే తల భాగంలో బొబ్బలు రావడం జరిగాయి. ఆ బొబ్బలు వచ్చిన చోట వైద్యులు వైద్యం చేశారు. ఆపై ఆయింట్ మెంట్ రాశారు. ఈ ఆయింట్మెంట్‌ను కొన్ని రోజులపాటు అప్లై చేసుకోవాలని డాక్టర్ ఇచ్చిన సలహాలను పాటిస్తూ.. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు వీలుగా మంత్రి శీనన్న తలపై టోపీని ధరించి కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తేలింది. ఇది మంత్రి శీనన్న టోపీ ధరించడం వెనుక ఉన్న మర్మం.