మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీకి కీలక నిర్ణయం

by srinivas |
AP SEC
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడుత పంచాయతీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగ్డ రమేశ్ కుమార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమై నామినేషన్ వేసి మరణించిన వారి స్థానంలో మళ్లీ నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ వేసేందుకు అవకావం కల్పిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఏపీలో ఇప్పటివరకూ మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేసిన అభ్యర్థుల్లో 56 మంది మృతిచెందినట్టు ఎస్ఈసీ ప్రకటించింది.

Advertisement
Next Story

Most Viewed