- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హామీ ఇస్తేనే సర్వే.. తేల్చి చెప్పిన నిర్వాసితులు
దిశ, చండూరు: శివన్నగూడ రిజర్వాయర్‌తో ముంపునకు గురవుతున్న వెంకెపల్లి గ్రామంలో సోమవారం ఆర్అండ్ఆర్ సర్వే నిర్వహించడానికి వెళ్లిన అధికారులను నిర్వాసితులు అడ్డుకున్నారు. దేవరకొండ ఆర్డీఓ గోపిరామ్ ఆధ్వర్యంలో 170 మంది సిబ్బంది గ్రామంలోకి ఉదయాన్నే ప్రవేశించారు. సర్వే నిర్వహించేందుకు నిర్వాసితులు ససేమిరా అన్నారు. రిజర్వాయరు ప్రారంభమై ఆరు సంవత్సరాలు కావస్తున్నా నష్టపరిహారంతో పాటు ఇళ్లకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ప్యాకేజీ ఎంత ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే సర్వే జరుగుతుందని నిర్వాసితులు తేల్చి చెప్పారు. వీరికి తోడుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ట్రైనీ కలెక్టర్ ప్రతిమా సింగ్, దేవరకొండ డీఎస్పీ ఆనంద్ రెడ్డి, మర్రిగూడ తహసీల్దార్ దేశీయ నాయక్ నిర్వాసితులతో పలుమార్లు చర్చలు జరిపారు. కానీ తమకు లిఖిత పూర్వక హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని భీష్మించుకు కూర్చోవడంతో చేసేదేమీలేక అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు.