ఆ రేపిస్ట్ కు 10 ఏళ్ళు జైలు శిక్ష, వెయ్యి జరిమాన

by Shyam |   ( Updated:2021-10-11 11:50:53.0  )
ఆ రేపిస్ట్ కు 10 ఏళ్ళు జైలు శిక్ష, వెయ్యి జరిమాన
X

దిశ, చార్మినార్ : ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యాచార కేసులో నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఛత్రినాక ఇన్ స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని తెలిపిన వివరాల ప్రకారం .. లక్ష్మీనగర్ కు చెందిన మహిళను అయోధ్యనగర్ కు చెందిన బెల్లం కొండ సుమన్(31) ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు. 2016 లో పెళ్లి చేసుకుంటానని ఆమె కు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చినవుడల్లా దాటవేయడం.. నిరాకరిస్తుండడంతో తాను మోసపోయానని గుర్తించిన మహిళ అప్పట్లో ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. కేసు విచారించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు స్పెషల్ సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ డి.నాగార్జున్ నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష తో పాటు వెయ్యి రూపాయలు జరిమాన విధించారు.

Advertisement

Next Story

Most Viewed