- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చిరుతకే చెమటలు పట్టించిన కుందేలు.. వీడియో వైరల్
దిశ, వెబ్ డెస్క్: ప్రమాదాలు ఎప్పుడు ఏ రూపంలో వస్తాయో తెలియవు. కానీ ప్రమాదం వచ్చినప్పుడు వెంటనే తప్పించుకొనే తెలివితేటలూ అందరికి ఉండవు. అలా సరైన సమయంలో ఆలోచించే వారు ఎప్పుడు ముందుకు దూసుకెళ్తారు. అది మనుషులైన, జంతువులైన… అడవిలో పెద్ద పెద్ద జంతువులతో పాటు, చిన్న చిన్న జంతువులు తిరుగుతూ ఉంటాయి. ఇక చిన్న చిన్న వాటి మీద పెద్ద జంతువులు కన్ను పడడం సాధారణం. అలాంటి సమయంలో ఆ చిన్న జంతువులు వాటి నుండి తప్పించుకోవడానికి ఒక యుద్ధమే చేస్తాయి. తాజాగా ఒక బుజ్జి కుందేలు, పెద్ద చిరుత పులి నుండి తన ప్రాణాలను ఎలా తప్పించుకుందో చూడండి.
అడవిలో ఆకలితో ఉన్న ఒక చిరుత పులికి ఎంచక్కా ఆకులు తింటూ ఆడుకుంటున్న ఒక కుందేలు కనిపించింది. అసలే ఆకలి.. పులి ఊరుకుంటుందా? వెంటనే కుందేలును పట్టుకొని ఆబగా లాగించేద్దామనుకుంది. అనుకున్నదే తడవుగా కుందేలు పై ఒక్క పంజా విసిరింది. కానీ తెలివైన కుందేలు ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలని చిటుకున్న ఒక గెంతు గెంతి పక్కకు దూకింది. పులి వెంటపడే లోపే చెంగు చెంగున దూకుతూ తుప్పలోకి వెళ్ళిపోయింది. ఇక కుందేలు వెంటపడుతూ వెళ్లిన పులి ఆ తుప్పలో ఇరుక్కుపోయింది.
చిరుత నుండి తప్పించుకున్న కుందేలు బతుకు జీవుడా అంటూ అడవిలోకి పారిపోయింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సమాజంలో క్రూరమైన మృగాలు చాలానే ఉన్నాయి. వాటి నుండి వచ్చే ప్రమాదాల నుండి కూడా ఇలాగే తప్పించుకోవాలి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా చిరుత పులికే చెమటలు పట్టించిన కుందేలు తెలివి శబాష్ కదా..!
The rabbit has a skill in running away. pic.twitter.com/4W8P1MkZmm
— Life and nature (@afaf66551) March 25, 2021