భారత చట్టానికి ట్విట్టర్ అతీతం కాదు.. కచ్చితంగా పాటించాల్సిందే

by Shamantha N |
Parliament
X

న్యూఢిల్లీ: పార్లమెంటరీ ప్యానెల్ ముందు హాజరైన ట్విట్టర్ ఇండియా అధికారులపై ప్రశ్నలు కురిశాయి. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఈ దేశ చట్టాలకు అతీతం కాదని, కచ్చితంగా రూల్ ఆఫ్ ల్యాండ్‌ను పాటించాల్సిందేనని ప్యానెల్ ఆదేశించింది. కాంగ్రెస్ నేత శశిథరూర్ సారథ్యంలోని ఐటీ ప్యానెల్ ట్విట్టర్ ఇండియా లీగల్ కౌన్సెల్ ఆయూషీ కపూర్, పబ్లిక్ పాలసీ సీనియర్ మేనేజర్ షాగుఫ్తా కమ్రాన్‌లను కొత్త డిజిటల్ చట్టాలను పాటించాలని ఆదేశించింది. భారత ప్రభుత్వ చట్టాల కంటే కంపెనీ చట్టాలే ప్రధానమా? అని ప్రశ్నించింది. ఇందుకు తమకూ రెండూ ప్రధానమేనని ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం. గంటన్నరపాటు ప్యానెల్ సభ్యులు ప్రశ్నలు కురిపించినట్టు తెలిసింది. అనంతరం, పౌరుల హక్కులు కాపాడటానికి తాము ప్రభుత్వం, పార్లమెంటరీ ప్యానెల్‌తో కలిసి నడుస్తామని ట్విట్టర్ ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story