ప్రదర్శనకు ఒలింపిక్ జ్యోతి

by Shyam |
ప్రదర్శనకు ఒలింపిక్ జ్యోతి
X

దిశ, స్పోర్ట్: ఒలింపిక్ జ్యోతిని సెప్టెంబర్ 1 నుంచి ప్రదర్శనకు ఉంచాలని జపాన్ ఒలింపిక్ కమిటీ (జేఓసీ) నిర్ణయించింది. ఈ మేరకు జపాన్‌లోని ఒలింపిక్ మ్యూజియంలో ఈ జ్యోతిని ప్రదర్శించనున్నట్టు వెల్లడించింది. ఈ జ్యోతి గ్రీస్ నుంచి వచ్చిన తర్వాత చివరిసారిగా ఫుకుషిమాలో వెలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కరోనా కారణంగా మార్చిలో క్రీడలన్నీ వాయిదా పడ్డాయి.

ఇదే క్రమంలో ఒలింపిక్స్ కూడా 2021 వరకు వాయిదా వేయడంతో, జ్యోతిని ఎలా నిల్వచేయాలన్న దానిపై నిర్వాహకులు చర్చించారు. అయితే, స్పోర్ట్స్ కోసం నిర్మించిన నేషనల్ స్టేడియం సమీపంలోని జేఓసీ మ్యూజియంలోనే ప్రదర్శించాలని నిర్ణయించారు. వైరస్ నేపథ్యంలో కొవిడ్ నిబంధనల మధ్య సందర్శకులను అనుమతించనున్నారు. ప్రజలు గుమిగూడకుండా, నిర్దేశిత సమయం, తేదీలతో రిజర్వేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే, డైరెక్ట్ కాంటాక్ట్‌ను అరికట్టేందుకు జనాలు ఒకే మార్గం గుండా వెళ్లేలా చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 1 నుండి నవంబర్ 1 వరకు ప్రదర్శించనున్న ఒలంపిక్ జ్యోతిని ఆ తర్వాత ఎక్కడ నిల్వ చేస్తారన్న విషయాన్ని మాత్రం నిర్వాహకులు వెల్లడించలేదు.


Advertisement

Next Story