- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం.. బిడ్డకు జన్మనిచ్చి.. కరోనాతో తల్లి మృతి
దిశ, పర్వతగిరి : వర్ధన్నపేట మండలం కుట్రీయల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారిన పడిన ఓ నిండు గర్భిణి ఆడ శిశువుకు జన్మనిచ్చి మృతిచెందింది. వివరాల ప్రకారం.. పది రోజుల క్రితం నిండు గర్భిణి పాముల మౌనిక (21)కి కరోనా పరీక్షలు నిర్వహించగా రిపోర్టులో పాజిటివ్ అని తేలింది.
దీంతో వైద్యుల సలహా మేరకు ఇంటివద్దే ఉంటూ చికిత్స పొందింది. ఈ క్రమంలో ఆమెకు పురిటి నొప్పులు రావడంతో వరంగల్ జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆపరేషన్ అనంతరం ఆమెకు ఆడ శిశువు జన్మించింది. బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే మౌనిక తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ.. ఈరోజు తెల్లవారుజామున మౌనిక తుదిశ్వాస విడిచింది. మౌనిక మృతితో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే కట్రీయల గ్రామంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ కరోనా కట్టడిలో నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. మౌనిక మృతదేహానికి దహన సంస్కారాలు చేయడానికి కూడా గ్రామపంచాయతీ తరుఫున కనీస ఏర్పాట్లు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.