‘తుపాకులు చూపించి.. దారి ఇవ్వాలని బెదిరింపు’

by Shamantha N |
‘తుపాకులు చూపించి.. దారి ఇవ్వాలని బెదిరింపు’
X

ముంబయి: మహారాష్ట్రలో పూణె ముంబయి ఎక్స్‌ప్రెస్ వేపై ఇద్దరు వ్యక్తులు ట్రక్కు డ్రైవర్‌కు తుపాకులు ఎక్కుపెడుతూ కారును తీసుకెళ్లారు. ట్రక్కు ముందు నుంచి వెళ్తు కారు పాస్ అయ్యే వరకు నిలిచి ఉండాలని తుపాకులతో బెదిరించారు. ఆ కారు వెనుక అద్దానికి పులి బొమ్మ ఉన్నది. ఈ వీడియోను ట్వీట్ చేస్తూ ఆ వ్యక్తులు శివసైనికులేనని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆరోపించారు. ఆ కారుపై ఉన్న లోగో వాళ్లెవరో తెలుపుతున్నదని పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగిందని, హోం శాఖ, డీజీపీ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Next Story