- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పోరాట స్ఫూర్తిని చాటుదాం.. మావోయిస్టు పార్టీ పిలుపు
దిశ, క్రైమ్ బ్యూరో: ఇంద్రవెల్లి పోరాట స్ఫూర్తిని, అమరుల పోరాట వారసత్వాన్ని ప్రతిఒక్కరూ చాటి చెప్పాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ ప్రజలకు పిలపునిచ్చారు. బ్రిటీష్ ప్రభుత్వం జలియన్ వాలాబాగ్‌లో ప్రజలపై కాల్పులు చేసినట్టుగా 40 ఏళ్ల క్రితం గిరిజన రైతుకూలి సంఘం మహాసభపై పోలీసులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి అమరుల పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని కోరుతూ గ్రామాలు, గూడాలు, పట్టణాలు, బస్తీలు, పని ప్రదేశాలలో సభలు, సమావేశాలు, సెమినార్లు నిర్వహించాలని జగన్ పేరుతో శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆదివాసీ సమస్యలపై సభ నిర్వహించుకోవడం కోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరినా.. ఇవ్వకపోగా, 144 సెక్షన్ విధించి అమానుషంగా కాల్పలు జరిపారని అన్నారు.
పీపుల్స్ వార్ పార్టీ నాయకత్వం అనేక నిర్భంధాలను ఎదుర్కొని గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించడం కారణంగానే ప్రస్తుతం దండకారణ్యంలో జనతన సర్కార్లు పనిచేస్తున్నట్టు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు అధికారం చెలాయిస్తూ బహుళజాతి కంపెనీలకు, కార్పొరేట్ శక్తులకు తలొగ్గి ఉద్యమ ప్రాంతంలో అణిచివేత దాడులు చేపడుతున్నట్టు తెలిపారు. అయినప్పటికీ 40 ఏళ్లుగా ఇంద్రవెల్లి సాక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు విప్లవోద్యమాలకి అంకితమై అనేక త్యాగాలతో విప్లవ కార్యకర్తలు పోలీస్ ఎన్ కౌంటర్లలో అమరులైనట్టు గుర్తు చేశారు. ఇంద్రవెల్లి గాయాలు మానినా నివురుగప్పిన నిప్పులా.. ఇంకా గుర్తులు మాసిపోలేదన్నారు. ఆదివాసుల హక్కు జల్-జంగల్-జమీన్-ఇజ్జత్ అధికారం దక్కేంత వరకూ ఉద్యమించాలని ఆయన ప్రజలను కోరారు.