మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. ఐద్వా డిమాండ్​

by Shyam |   ( Updated:2021-10-30 05:44:58.0  )
మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. ఐద్వా డిమాండ్​
X

దిశ, చార్మినార్: అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మహిళల సమస్యలపై సర్వే చేశారు. సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీలోని కాలనీలలో శనివారం మహిళా కార్మికులు, చిరు వ్యాపార్థులతో సర్వే నిర్వహించారు. కరోనా కారణంగా ఉపాధి పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని.. మహిళలు ఐద్వా దృష్టికి తీసుకువచ్చారు. వ్యాపారాలు సరిగ్గా నడవక పోవడం.. పనులు సక్రమంగా దొరకక పోవడంతో తమ పిల్లలను బడికి పంపలేక పోతున్నామన్నారు. దీంతో పిల్లలు ఇళ్ల వద్దనే ఉండడంతో అనేక దురలవాట్లకు బానిసలవుతున్నారన్నారు.

కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన మహిళా కార్మికులకు ప్రభుత్వమే ఉపాధి అవకాశాలు కల్పించాలని, పట్టణాలలో కూడా ఉపాధి హామీ పథకం అమలు చేయాలని ఐద్వా సంఘం డిమాండ్ చేసింది. ఈ సర్వేలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు టీ. జ్యోతి, అధ్యక్షురాలు ఆర్.అరుణ జ్యోతి, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి పి.శశికళ జిల్లా నాయకురాలు నాగమణితో పాటు స్థానిక మహిళలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed