4 వారాల్లోగా చెప్పండి.. ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్

by Anukaran |
High Court, Osmania Hospital
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని ప్రభుత్వం పునరుద్ధరిస్తుందా? లేక కొత్తదాన్ని నిర్మిస్తుందా? అనే దానిపై నాలుగు వారాల్లోగా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి నిర్వహణ పురాతన భవనంలో కొనసాగుతోందని, దాన్ని కూల్చివేయడంపై వారసత్వ సంపద దెబ్బతింటోందంటూ పిటిషన్ దాఖలైందని, అదే సమయంలో కొత్త ఆసుపత్రిని నిర్మించాలన్న పిటిషన్‌ కూడా దాఖలైందని హైకోర్టు పేర్కొంది. ఈ రెండు రకాల పిటిషన్లను గురువారం విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లోగా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని సూచించింది. ఉస్మానియా ఆసుపత్రి ప్లాన్‌తో పాటు సమగ్ర నివేదికను సమర్పించాలని పేర్కొంది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై గతంలో రాష్ట్ర ప్రభుత్వం విధాన ప్రకటన చేసిందని హైకోర్టు తెలిపింది. ఈ ఆసుపత్రి నిర్మాణం లేదా పునరుద్ధరణపై ప్రభుత్వం ఉన్నతస్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed