- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం: హార్వెస్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దిశ,దుబ్బాక: ప్రమాదవశాత్తు హార్వెస్టర్ బోల్తాపడి డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని కోనయపల్లి గ్రామ శివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొండపోచమ్మ నుంచి రామాయంపేట కెనాల్ మీదుగా AP24AL 4939 హార్వెస్టర్ మిషిన్ వ్యవసాయ పొలాలకు వరి పంట కోసేందుకు వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. హార్వెస్టర్ అదుపు తప్పి బోల్తాకొట్టడంతో డ్రైవర్ హరి బాబు అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడికి భార్య కవిత, ముగ్గురు పిల్లలు ప్రసాద్, మల్లికార్జున్, అమ్ములు వున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల తండ్రి మరణంతో ఆ కుటుంబం రోడ్డు పాలయింది. విషయం తెలుసుకొని స్థానిక ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరు పరిశీలించారు. కాగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.