ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి గిరిజనులది

by Shyam |
ప్రకృతిని పూజించే గొప్ప సంస్కృతి గిరిజనులది
X

దిశ ప్రతినిధి, వరంగల్: ప్రకృతిని, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే గిరిజనులు పంటలు సమృద్ధిగా పండాలని, పాడి పశువులు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ వనదేవతలను పూజిస్తూ ప్రతియేటా సీత్లా పండుగ జరుపుకుంటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలో‌ని ఆమె స్వగ్రామం గుండ్రాతిమడుగు పెద్దతండాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండుగ సంబరాల్లో భాగంగా మంత్రి అందరితో కలిసి ఆడిపాడారు. సంప్రదాయ నృత్యం చేశారు. వనదేవతలకు ప్రసాదాలు సమర్పించారు.

Advertisement

Next Story

Most Viewed